సోనియా అల్లుడివా? సో వాట్?
posted on Feb 22, 2015 @ 9:41PM
తన అత్తగారు సోనియా గాంధీ పార్టీ అధికారంలో వుండగా మహారాజులా వైభవాన్ని అనుభవించిన రాబర్ట్ వాద్రాకి ఇప్పుడు అంత సీన్ లేకుండా పోతోంది. అధికారం పోవడంతో హోదాలు కూడా తగ్గిపోతున్నాయి. గతంలో ఎయిర్ పోర్టుల్లో ఎవరెవరిని చెక్ చేయకూడదో పెద్ద లిస్టు వుండేది, భారత రాష్ట్రపతితో మొదలయ్యే ఆ లిస్టులో చివర్లో రాబర్ట్ వాద్రా గారి పరివారం పేరు కూడా వుండేది. ఆయనకు ఏ హోదాతో ఆ అధికారం కల్పించారో అడిగినా సమాధానం చెప్పినవారు అప్పట్లో లేరు. ఇప్పుడు ఆ హోదా ఇప్పుడు పోతోంది. గోవా విమానాశ్రయంలో తనిఖీలు చేయవలసిన అవసరం లేని ప్రముఖుల జాబితా నుంచి వాద్రా పేరును తొలగించారు. మిగిలిన విమానాశ్రయాలలో కూడా అదే జరగవచ్చని తెలుస్తోంది. వాద్రాకు ప్రత్యేకంగా ఏ అధికారిక హోదా లేకపోయినా ఆయనను భద్రత తనిఖీ నుంచి మినహాయించారు. ఇప్పుడు ఆ హోదాలు, వైభవాలు క్రమంగా పోతున్నాయి.