సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు

 

భారత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి జరుగుతాయి. ఇటీవలి కాలంలో మోడీ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కి బిల్లులు పెట్టి ఈ సమావేశాల్లోనే ఆమోదించుకోవాల్సి వుంది. మత మార్పిడి బిల్లుతో సహా ఇంకా అనేక అంశాలలో మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా వున్నాయి. బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 23 నుంచి మే 8వ తేదీ వరకు రెండు విడతలుగా జరుగుతాయి. తొలి విడతగా ఈనెల 23 నుంచి మార్చి 20 వరకు జరుగుతాయి. నెల రోజుల విరామం తర్వాత ఏప్రిల్‌ 20 నుంచి మే 8 వరకు మలి విడత సమావేశాలు జరుగుతాయి. తొలి విడతలో 20 రోజులు, మలి విడతలో 13 రోజుల చొప్పున ఉభయ సభలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయి.

Teluguone gnews banner