Read more!

అద్వాని రాజీనామా నాటకాలెందుకు?

 

.....సాయి లక్ష్మీ మద్దాల

 

 

 

 

మొత్తం మీద ఆర్.ఎస్.ఎస్ జోక్యంతో, సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ, ఉమాభారతి వంటి ఆయన ప్రియ శిష్యుల బుజ్జగింపుతో అద్వాని రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు రాజనాధ్ సింగ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇక్కడ దేశ ప్రజలు అద్వానీ నుండి చాలా సమాధానాలు ఆశిస్తున్నారు. కానీ మధ్యలో రాజనాధ్ సింగ్ రాయబారాన్ని కాదు. అసలు అద్వాని ఎందుకు రాజీనామా చేశారు? ఎందుకు ఉపసంహరించుకున్నారు? నరేంద్ర మోడీకి కేవలం గుజరాత్ ప్రజల జనాకర్షనే తప్ప, దేశ ప్రజల జనాకర్షణ లేదని అద్వాని అభిప్రాయం. అలాంటివాడు ప్రజాస్వామ్యంలో దేశనేత కాలేడు అని ఆయన పిడి వాదం కుడా. కాని మరి అద్వాని ఎ ప్రజాకర్షణతో బి. జె. పి అధ్యక్షుడు అయ్యాడు.


  అద్వాని మొన్న రాజీనామా చేసినా, నేడు దానిని ఉపసంహరించుకున్నఅది ఎవరికోసం? ప్రజల కోసమా? పార్టీ కోసమా? పదవి కోసమా? ఈ ప్రశ్నలన్నిటికి  సమాధానం దేశ ప్రజలకు అద్వాని వివరించాలి. ఇలా మొహం చాటేయటం కాదు ఒక అనుభవఘ్నుడైన రాజనీతిఘ్నుడు చేయవలసింది. బి. జె. పి.. ఆర్. ఎస్. ఎస్ ఆధ్వర్యం లోనే నడుస్తుందని మోహన్ భగవత్ రాయభారంతో మెత్తబడిన అద్వాని వైఖరే స్పష్టం చేస్తోంది. మరి అద్వాని సారధ్యంలోని బి.జె. పి కి ఏ ముద్ర వేయాలి? దానికి మళ్ళి రాజీనామా, ఉపసంహరణ అంటూ ఇంత ప్రయోగాత్మకమైన చవుకబారు నాటకాలెందుకు? ఈ మొత్తం ఉదంతంతో దేశప్రజలకు అద్వాని గురించి ఏమని అర్ధం కావాలి? అద్వానీ కేవలం ఒకరాజకీయ నాయకుడే కాని, రాజనీతిఘ్నుడుకాడు అనా !.....