వైసీపీ పోయింది.. టీడీపీలోకి
posted on Sep 14, 2015 @ 4:22PM
ఇప్పటి వరకూ చాలా మంది నేతలు వైసీపీ పార్టీలోకి చేరిన సంగతి తెలసిందే. అయితే ఇప్పుడు వైసీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు టీడీపీలోకి చేరనున్నట్లు.. అందుకు రంగం సిద్దమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదిరెడ్డిని ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ పదవి నుండి తప్పించి అతని స్థానంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును నియమించారు. నిజానికి ఆదిరెడ్డి ఎమ్మెల్సీ పదవి దక్కడం ఆతర్వాత ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ పదవి దక్కడం ఊహించని రీతిలో జరిగాయి. అయితే ఇప్పుడు తనను కాదని ఆపదవి వేరే వాళ్లకి కట్టబెట్టడంతో ఆసంతృప్తికి గురైన ఆదిరెడ్డి టీడీపీలోకి మారనున్నట్టు తెలుస్తోంది.
అయితే దీనికి వేరే కారణం లేకపోనూలేదు. ఏంటంటే గత కొద్దికాలంగా ఆదిరెడ్డి టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆదిరెడ్డి అప్పారావుకి టీడీపీ నేత ఎర్రన్నాయుడు కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. అయినా ఆదిరెడ్డి మాత్రం వైసీపీలో చేరారు. అయితే ఇప్పుడు ఆదిరెడ్డి ఎర్రన్నాయుడు తమ్ముడైన అచ్చెన్నాయుడితో రాజకీయ రాయబారాలు నడుపుతున్నారని అనుమానంతో జగన్ అతనిని పదవిని తప్పించినట్టు చెబుతున్నారు. దీంతో ఆదిరెడ్డి కూడా ఎలాగూ టీడీపీ మంత్రి వర్గంలో అచ్చెన్నాయుడు కీలకంగానే ఉన్నారు.. మరోవైపు ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు కూడా ఎంపీ గా ఉండటంతో వాళ్ల అండతో అండతో టీడీపీలో ఎదగొచ్చని ఆలోచించి తాను కూడా టీడీపీలోకి చేరడానికే సముఖత చూపినట్టు తెలుస్తోంది.