హిందువు మతం ప్రకారం.. ఇవి దానం చేస్తే ఖతం..
posted on Jul 7, 2021 @ 10:40AM
మతం అంటే కొన్ని కోట్ల మంది ఆచారపు అలవాట్లు.. వాళ్ళ జీవన విధానం.. వాళ్ళ సంస్కృతి.. అని చెప్పవచ్చు.. హిందువులు మతంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి.. కొన్ని నిబంధనలు ఉన్నాయి.. భారత దేశమంతా హిందూ మతంలో కొన్ని ముఖ్య విషయాలు.. ఏదైనా వస్తువు దానం చేసేటప్పుడు.. దానివల్ల జరిగే మంచి చెడులు చూస్తాం.. ఒక్కొక్కసారి దానం చేయడం శుభసూచకంగా భావిస్తారు. ఇలా చేస్తే ఇంట్లో మంచి జరుగుతుందని.. అయితే మన హిందూ మంతం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులు దానం చేయొద్దు..! ఒకవేళ చేశారనుకో అంతే సంగతులు..? తిరుపతి వెంకన్న దగ్గరికి పోకుండానే గుండు.. మూడు నామాలు మీకు పడినట్లే.. మరి ఇంతకీ ఏం ఏం వస్తువులు దానం చేయకూడదో తెలుసుకుందామా ? మరి..
1. పసుపు
పసుపుకు అటు సైటిఫిక్ ఇటు శాస్రం గా మంచి పేరు ఉంది.. వాస్తు శాస్త్రం ప్రకారం.. సాయంత్రం పసుపు దానం చేస్తే ఇంట్లో మంచి జరగదు. పసుపు బృహస్పతి కారకంగా పరిగణిస్తారు. కనుక సాయంత్రం పసుపును దానం చేయకూడదు.
2. పాలు
పాముకి పాలు పోస్తే అది చివరికి విషాన్ని చిమ్ముతుంది అన్న సామెత వినేవుంటారు.. పాలు చాలా స్వచ్చమైనవి.. రంగులోను రుచిలోనూ చాలా అద్భుతమైనవి. పాలు నేరుగా చంద్రుడికి సంబంధించినవి. ఇది లక్ష్మీ, విష్ణు దేవత కారకంగా నమ్ముతారు. అందువల్ల సూర్యాస్తమయం తరువాత పాలు దానం చేయడం వల్ల డబ్బు కొరత ఏర్పడుతుంది.
3. పెరుగు
వాస్తు ప్రకారం పెరుగును శుక్రుని కారకంగా పరిగణిస్తారు. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సుని తెస్తుంది. సాయంత్రం పెరుగు దానం చేయడం ద్వారా ఇంటి ఆనందం పోతుందని నమ్ముతారు.
4. పాడైపోయిన ఆహారాన్ని దానం చేయడం మంచిది కాదు..
చాలా మంది పాడైపోయిన అన్నని ఆడుకునేవాళ్ళకో.. లేదంటే ఇంట్లో పనిచేసేవాళ్లకో పెట్టి పుణ్యం కావలి అని అనుకుంటారు .. అన్ని దానాల్లో అన్నదానం గొప్పదనం అంటారు అందుకే పేదవారికి ఆహారం దానం చేస్తే పుణ్యలోకాలు దక్కుతాయని పెద్దలు చెబుతుంటారు. అయితే చాలా మంది పాడైపోయిన ఆహారాన్ని దానం చేస్తారు. అలా చేయడం పాపం. ఎల్లప్పుడూ శుభ్రమైన ఆహారాన్ని దానం చేయాలి.
5. డబ్బు, వ్యాపారం చేయవద్దు..
వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం ఎవరికీ రుణాలు ఇవ్వవద్దు. ఇలా చేయడం ద్వారా తల్లి లక్ష్మి వెళ్లిపోతుందని నమ్మకం. దీంతో పాటు ఇంట్లో డబ్బు సమస్యలు మొదలవుతాయి. అందువల్ల సాయంత్రం సమయంలో రుణాలు తీసుకోవడం మానుకోవాలి.
నోట్ - ఈ సమాచారం మత విశ్వాసాల ఆధారంగా ఉంటుంది. మేము కూడా హిందూ మతాన్ని బట్టి చెప్పడం జరిగింది.. సహాయం చేసేటప్పుడు తిథి నక్షత్రం చూడడం ఏంటి అని మీరు అనుకుంటే.. తప్పు ఏం లేదు.. మేము చెప్పిన పై మాటలకూ శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించండి..