జగన్ ఇంట్లో సోదాలు.. కీలక డాక్యుమెంట్లు సీజ్..
posted on Dec 15, 2021 @ 10:16AM
బ్రేకింగ్ న్యూస్. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా చట్టానికి చిక్కాల్సిందే. అధికారం చేతిలో ఉన్నంత మాత్రాన ఎక్కువ రోజులు తప్పించుకోలేరు. పాపం పండే రోజు వస్తుంది. అప్పుడు శిక్ష తప్పక పడుతుంది. పవర్‌ను అడ్డుపెట్టుకొని.. చెయ్యాల్సిన అరాచకాలన్నీ చేశారు. లెక్కలేనంత ఆస్తులు పోగేశారు. బినామీల పేరుతో కొన్ని.. బంధువుల పేరుతో ఇంకొన్ని.. అక్రమాస్తులు భారీగా కూడబెట్టారు. కట్ చేస్తే.. వన్ ఫైన్ డే ఆ అరాచకాల పుట్ట పగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్‌ఎండీఏ విజిలెన్స్ మాజీ డీఎస్పీ జగన్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. తాజాగా జగన్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ సోదాలు చేస్తోంది.
మాజీ డీఎస్పీ జగన్ ఇంట్లో 14 గంటలుగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. జగన్‌తో పాటు సెక్యూరిటీ గార్డు రామును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్న కీలక డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ జరుపుతున్నారు.
హెచ్‌ఎండీఏలో పని చేస్తున్న సమయంలో అక్రమాలు చేసినట్లు జగన్‌పై ఆరోపణలు వచ్చాయి. జగన్‌తో పాటు అతని బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. బోడుప్పల్, కొర్రెముల, జోడిమెట్లలో జగన్.. వెంచర్స్ వేసినట్టు గుర్తించారు. బినామీ పేరుతో పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నట్టు కూడా ఏసీబీ విచారణలో తేలింది.