డబుల్ డెక్కర్ రైలు వస్తోంది.. అందరు పక్కకి జరగండి..
posted on May 13, 2014 @ 9:47AM
రైలు ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డబుల్ డెక్కర్ రైలు హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణం ప్రారంభించింది. మంగళవారం ఉదయం 6.45 గంటలకు కాచిగూడ- గుంటూరు మధ్య ఏసీ డబుల్ డెక్కర్ రైలు ప్రారంభమైంది. రైల్వే శాఖ సీనియర్ ఉద్యోగి ఒకరు ఈ రైలుకు పచ్చజండా ఊపి ప్రారంభించారు. దీంతో దక్షిణాదిన తొలిసారిగా ఈ డబుల్ డెక్కర్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రతివారం కాచిగూడ- గుంటూరు- కాచిగూడ ఏసీ డబుల్ డెక్కర్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. బుధవారం నుంచి కాచిగూడ నుంచి తిరుపతికి డబుల్ డెక్కర్ సర్వీసు అందుబాట్లోకి వస్తోంది. తొలిసారి డబుల్ డెక్కర్ రైలు ఎక్కిన ప్రయాణికులు మురిసిపోయారు. సెల్ ఫోన్లతో రైలును ఫొటోలు తీసుకున్నారు. తొలి ప్రయాణంలో కాచిగూడ నుంచి గుంటూరు వరకు 500 మంది ప్రయాణికులు ప్రయాణించారు.