ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ
posted on May 31, 2024 @ 5:53PM
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్‌గా పదవీ విరమణ చేశారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఆయన పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘పోలీస్ ఆఫీసర్ కెరీర్ అంటేనే ఒడిదుడుకులు వుంటాయి. 35 సంవత్సరాల్లో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నానో, ఈ ఐదేళ్ళ కాలంలో కూడా అలాంటి వాటినే ఎదుర్కొన్నాను. ఈ ఐదేళ్ళ కాలంలోని ఏర్పడిన ఒడిదుడుకులను నేను ప్రత్యేకంగా చూడటం లేదు. అవన్నీ జీవితంలో ఒక భాగం. అన్యాయాన్ని ఎదుర్కోవడం నా వృత్తి ధర్మం. సత్యం, నీతి వైపు వుంటే, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడితే ఎప్పటికైనా విజయం సాధిస్తాం. ఐదేళ్ళపాటు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాననే దానికంటే, అంతిమ విజయం సాధించడం ముఖ్యం. ఈ అధ్యాయం మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పమంటే ‘వండర్‌ఫుల్’ అని చెప్తాను’’ అన్నారాయన.