ఏసీబీ అధికారులను అడ్డుకున్న ఆప్ ఎమ్మెల్యే అనుచరులు
posted on Sep 19, 2022 @ 10:36AM
పార్టీకి అప్రతిష్టతెచ్చే పనులు చేసినపుడు, అవినీతిలో కూరుకున్నపుడు ఎవరో ఒకరు హెచ్చరించక పోరు. మితిమీరినపుడు సామా న్యుడైనా, ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే అయినా ఏసీబీకి ఒకటే. అవినీతి నిరోధక శాఖ దృష్టిలో అందరూ సమానమే. తప్పు చేసి దొరికినపుడు సోదాలకు, తనిఖీ లకు వచ్చిన అధికారికి సహాయ పడటమే మంచిది. మా ఇంటికే వస్తారా.. అంటూ విర్రవీగితే ప్రతిష్ట గంగ లో కలిసినట్టే. ఇపుడు ఆప్ ఎమ్మెల్యే అమానుతుల్లాఖాన్ పరిస్థితి ఇదే.
అవినీతి ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్ నివాసాలపై అవినీతి నిరోధక విభా గం అధికారుల దాడుల సమయంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16న ఏసీబీ దాడులు జరిపిన సందర్భంలో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్ మద్దతుదారులు ఏసీబీ అధికారి పై చేయి చేసుకున్నారు. సదరు అధికారితో దురుసుగా ప్రవర్తించడమే కాక దుర్భాషలాడారు.
అమానతుల్లాఖాన్ నివాసానికి సమీపం నుంచి ఏసీబీ అధికారిని దూరంగా తోసుకుంటూ వెళ్లిపోయారు. ఘటనపై ఏసీబీ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విధుల్లో ఉండగా ఏసీబీ అధికారిపై దాడి చేసిన వారిలో నలుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది. విధుల్లో ఉన్న అధికా రులపై మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా చూసేందుకు ఉన్నతాధికారులు యత్ని స్తున్నారు.
రెండేళ్ల క్రితం ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్ ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా పనిచేసినప్పుడు నిబంధన లను ఉల్లంఘించి 32 మందిని అక్రమంగా నియమించారని ఆరోపణలున్నాయి. పైగా వక్ఫ్ ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా లీజుకు ఇచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన నివాసా లు, సన్ని హితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. రెండు పిస్తోళ్లు, తూటాలు, రూ.24 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.