కేజ్రీవాల్ నిస్సిగ్గుగా కోరుతున్నారు

 

ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంది. ఈ పార్టీ లోని చాలా ఎమ్మెల్యేలు ఏదో ఒక వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ తో మొదలైన నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం నుండి ఇప్పటి వరకు నాలుగైదుగురు ఎమ్మెల్యేలు పలు వివాదాలలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అసలు ఇంతమంది ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకుంటున్న నేపథ్యంలో అసలు ఆప్ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ ఏం చేస్తున్నారన్నది పలువురి అభిప్రాయాలు. ఇదిలా ఉండగా ఇప్పుడు కేజ్రీవాల్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పి ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లను పార్టీ నుండి భహిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కార్యకర్తలను తమ పార్టీలోకి వస్తే చాలా సంతోషమని.. ఒకవేళ అది జరిగితే చాలా మంచిదని వ్యాఖ్యానించారు. అయితే కేజ్రీవాల్ గారు ఇద్దరు నాయకులను పార్టీలోకి ఆహ్వానించారు కానీ వారు మాత్రం పార్టీలోకి వస్తారా? రారా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు.

 

మరోవైపు ఇప్పటికే పార్టీలోని చాలా మంది నేతలు పలుపలు ఆరోపణలో చిక్కుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్లను తిరిగి మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని పలు రాజకీయ నాయకులు ఎద్దేవ చేస్తున్నారు. ఇదే విషయంపై ప్రశాంత్ భూషణ్ స్పందించి తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ సమావేశంలో తమ ఎమ్మెల్యేలతో మాపై దాడి చేయించి ఇప్పుడు పార్టీలోకి రావాలని సిగ్గులేకుండా కోరుతున్నారని తిట్టిపోశారు. మరి ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలకు కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Teluguone gnews banner