నెల్లూరు జిల్లాలో ఆనం ఒంటరేనా? కేబినెట్ బెర్త్ మళ్ళీ అందని ద్రాక్షేనా?
posted on Sep 22, 2021 @ 5:16PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తు మొదలు పెట్టారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దగ్గరవుతున్న నేపధ్యంలో, ముందుగా అనుకున్న విధంగా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ గడువు సమీపిస్తోంది. ముఖ్యమంత్రి తోలి మంత్రివర్గం ఏర్పాటు సమయంలోనే , రెండున్నర ఎల్లా తర్వాత ఉద్వాసన ఉంటుందని, అప్పాయింట్ ఆర్డర్స్ తో పాటుగానే ఊస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశారు. సో.. ఆ గడవు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కసరత్తు ప్రారంభించారని పార్టీలో చర్చ జరుగుతోంది.
కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లేందుకు సిద్దంగా ఉండమని మంత్రులకు హింట్ ఇచ్చారని వార్తలొచ్చాయి. మరో వంక ఫస్ట్ కాబినెట్ లో బెర్త్ మిస్సయిన సీనియర్ నాయకులు ఈ సారైనా ఛాన్స్ దక్కుతుందా లేదా అని ఆశగా ఎదురుస్తున్నారు. అలాంటి వారిలో కొదరు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారని పార్టీ వర్గాల్లో వినవస్తోంది.
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నెల్లూరు జిల్లా సీనియర్ నాయకుడు ఆనం రామ నారాయణ రెడ్డి, అవకాశం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. జగన్ రెడ్డి ఫస్ట్ కాబినెట్’లోనే మంత్రి పదవి వస్తుందని ఆనం ఆశించారని అంటారు. నిజానికి అయన రెండు సార్లు పార్టీ మారింది, మంత్రి పదవి కోసమే అని అయన సన్నిహితులు అంటారు. మంత్రి పదవిని ఆశించే అనం సోదరులు రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. అయినా కారణాలు ఏవైనా చంద్రబాబు నాయుడు ఆనంకు అవకాశం ఇవ్వలేదు.
ఈ నేపధ్యంలోనే ముందుగానే జగన్ దగ్గర మాట పుచ్చుకుని మరీ ఆనం సోదరులు 2019 ఎన్నికల సమయంలో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అయితే అక్కడ కూడా మళ్ళీ అదే కథ. అదృష్టం మళ్ళీ అడ్డం తిరిగింది. మంత్రి పదవి రాలేదు. అనం ఆశించిన సీనియర్ కోటాను జంగన్ రెడ్డి అసలు పట్టించుకోలేదు. కారణాలు ఏవైనా ఆయన సీనియర్లు వద్దనే అనుకున్నారు. ఒకటి రెండు మినహా మిగిలిన బెర్తులన్నీ జూనియర్లకే కేటాయించారు. నెల్లూరు జిల్లా నుంచి రెడ్డి కోటాలో మేకపాటికి, బీసీ కోటాలో అనిల్ కుమార్ కు అవకాశం ఇచ్చారు. ఈనేపధ్యంలో ఇప్పుదైనా ఆనంకు మంత్రి పదవి దక్కుతుందా అనే చర్చ జరుగుతోంది.
అయితే ఈసారీ.. ఆనంకు సారీనే అనటున్నారు. అనంతో పాటుగా జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న వారు కనీసం మరో ఐదుగురు వరకు ఉన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి, కోటం రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి, సంజీవయ్య ..మంత్రి పదవుల రేసులో ఉన్నారు. మరో వంక పార్టీలో చేరి, ఎమ్మెల్యేగా గే;లిచింది మొదలు ఆనం రామ నారాయణ రెడ్డి, జగన్ ఆశించింది ఇవ్వలేక పోయారు. విధేయత చూపడంలో విఫలమయ్యారు. అసమ్మతి గళం కూడా వినిపించారు. అంతే కాదు, కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు, జగన్ రెడ్డిని చాలా దుర్మార్గంగా దూషించారు. కాబట్టి ఆనంకు మంత్రివ పదవి ఈసారి కూడా అందని ద్రాక్షగానే మిగిలిపోతుందని అంటున్నారు.