అరగంటలో పెళ్లి అంతలోనే విషాదం..
posted on Jun 5, 2021 @ 2:24PM
ఏ నిమిషానికి ఏమి జరిజరుగునో ఎవరూహించెదరు.. అనే పాట వినే ఉంటారు.. ప్రస్తుత కాలంలో మృత్యువు ఏ వైపు నుండి వస్తుందో తెలియడం లేదు. కరోనా వైరస్ రావడం వల్ల గత సంవత్సరం నుండి మరణ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దేశంలో మిగతా విషయాలు పక్కన పెట్టి. మీడియా కూడా రెట్టింగ్ కోసం పరుగులు తీస్తుందని, అనవసరంగా దేశ ప్రజలను దారి మళ్లించడానికే ఒకే వార్తలు మోస్తున్నారని దేశ ప్రజలకు సందేహాలు రాకపోలేదు. సరే ఏది ఏమైనా.. ఆ విషయం పక్కన పెట్టి విష్యంలోకి వెళదాం..
ఓపెన్ చేస్తే.. అది కామారెడ్డి జిల్లా. గాంధారి మండలం. జువ్వాడి గ్రామానికి చెందిన మల్లమారి పెద్ద సాయిలు కూతురు మల్లికకు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగపూర్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. అందరికి పెళ్లి పత్రికలు ఇచ్చారు. అమ్మాయి కుటుంబ సభ్యులు, సహాయానికి వెనకుండే, బంధువులు తినడానికి రెడీ అయ్యారు. జక్కడు జమ్మాడు అందరు కలిసి సుమారు 20 మంది.. ట్రాక్టర్‌లో పెళ్లి సామానుతో తాడ్వాయి మీదుగా కామారెడ్డి లో ఉన్న పెళ్ళికొడుకు ఇంటికి బయల్దేరారు. అంతే రామేశ్వరం వెళ్లిన శనేశారం వెంట ఉన్నట్లు. అరగంటలో పెళ్లి.. ఇంతలో ట్రక్కు రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. వెనక నుంచి వేగంగా వస్తున్న ట్రక్కు పెళ్లి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. కళ్లుమూసి తెరిసేలోపు పెళ్లి ట్రాక్టర్ బోల్తాపడిండి. అక్కడికక్కడే ఇద్దరి మృతి చెందగా, 15 మందికి గాయాలు ఈ విషాద ఘటన తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామం వద్ద చోటుచేసుకుంది.
బాధితుల వివరాల ప్రకారం.. పెళ్లికి మరొక అరగంట సమయం ఉందనగా.. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో పెద్దమ్మ ఆలయం మూల మలుపు వద్ద గ్రామానికి చెందిన మరొక పెళ్లి బృందం రోడ్డుపై నుంచి వెళ్తుండటంతో ట్రాక్టర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేసాడు. అప్పటికే వెనక ట్రాక్టర్ వెనకాలే సుమారు నాలుగు ట్రక్కులు వస్తున్నాయి. అతివేగంగా వస్తున్న ట్రక్కు.. ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ క్రమంలో ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా పడింది. ట్రాక్టర్‌లో ఉన్న పెళ్లి సామగ్రి.. మంచం, బీరువా ఇతర సామాను పెళ్ళికి వెళ్తున్న వారిపై పడటంతో సుమారు 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆటోలు, 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాడ్వాయి పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. జిల్లా ఆస్పత్రికి తరలించిన వారిలో జువ్వాడి గ్రామానికి చెందిన కాశవ్వ అనే మహిళ మృతి చెందినట్టు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తాడ్వాయి ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు.