మందు సారు.. స్కూల్ బారు..
posted on Mar 26, 2021 @ 12:23PM
ఎవరైనా మందు బార్లోనో, వైన్స్ లోనో .. లేదంటే ఇంట్లోనో తాగుతారు. గుడిలాంటి బడిలో ఏవైనా మందు తాగుతారా.. అది ఒక అక్షరాశ్యుడు అయితే ఏమో అనుకోవచ్చు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే మద్యసేవిస్తే. ఆ ఉపాధ్యాయుడిని ఏమనాలి. అలాంటి ఉపాధ్యాయులను విద్యార్థులు ఎలాంటి విలువలు నేర్చుకోవాలి.
ఆయన పేరుకు మాత్రం ఉపాద్యాయుడు. కానీ నిత్యం మద్యం మత్తులో మునిగితేలే మద్యోపాధ్యాయుడు. మనిషి అన్నాక కొద్దిగా కళాపోషణ ఉండాలి గానీ మరి వృత్తి పర విధుల్లో ఉంది ఇలాంటి పడుపని చేసే కళాపోషణ మాత్రం ఉండకూడదు. చిత్తూరు జిల్లా పాకాల మండలం కృష్ణాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏకోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కోటేశ్వర రావు పాఠశాలలోనే మద్యంతో పాటు బిరియాని తింటూ ఉండగా గమనించిన విద్యార్థులు తల్లిదండ్రులు వీడియో తీశారు. వీడియో తీస్తున్నారన్న విషయం తెలిసిన మేలుకోని ఆ బూతు ఉపాద్యాయుడు పల్లెటూరు వాళ్ళు కదా నన్ను ఏం చేస్తారు అనుకున్నాడో ఏమో గానీ .. ఆయన దుస్తులు విప్పుతా తీసుకుంటారా అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. వీడియో తీసుకోండంటూ మద్యం బాటిల్, బిరియాని పైకెత్తి మరీ చూపించాడు. నిత్యం మద్యం మత్తులో విధులకు హాజరై చిన్న చిన్న విషయాలకే విద్యార్ధుల దుస్తులు విప్పి పైశాచికంగా ప్రవర్తిస్తున్న కోటేశ్వరరావుపై అప్పటికే ఆగ్రహంగా వున్న తల్లిదండ్రులు
ఆ వీడియోను విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపించారు. విజయనగరం జిల్లాకు చెందిన కోటేశ్వర రావు గతంలో కుప్పంలో పని చేసినప్పుడు కూడా ఇలాగే తాగి పాఠశాలకు హాజరయ్యే వాడని సమాచారం.
రెండు నెలలక్రితం బదిలీపై కృష్ణాపురం పాఠశాలకు వచ్చిన ఈయన వ్యవహార శైలి మొదటి నుంచి అలాగే వుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోటేశ్వర రావును విధులనుంచి తాత్కాలికంగా తొలగించినట్లు డీఈవో నరసింహా రావు గురువారం రాత్రి ప్రకటించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు స్థానిక సర్పంచ్, స్కూల్ కమిటీ ఛైర్మన్, సీఆర్సీ, హెచ్‌ఎం సమక్షంలో విచారణ జరిపామని తెలిపారు .పాఠశాల వేళల్లో మద్యం సేవించడమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని తేలడంతో చర్యలు తీసుకున్నట్లు డీఈవో ప్రకటించారు.