యూట్యూబ్ లో అశ్లీల కంటెంట్.. ప్రముఖ సింగర్‌కు వేధింపులు
posted on Jul 17, 2021 @ 6:05PM
యూట్యూబ్ కావచ్చు సోషల్ మీడియా ఏదైనా కావచ్చు కొంత మంది మందికి వాడుతుంటే ఇంకొంత మంది చెత్త కంటెంట్ కి వాడుతున్నారు. ఇంకొంత మందికి ఐతే సోషల్ మీడియా పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది. వాళ్లకు నచ్చిన కంటెంట్ పెట్టి చదువుకునే పిల్లలను పక్కద్రోవ పట్టిస్తున్నారు. ఇది ఒక దందా ఐతే ప్రముఖుల పేర్ల మీద సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళు ఇబ్బందులు పడేట్టు చేస్తున్నారు. వాళ్ళు చేసే పనులకి అడ్డుఅదుపు లేకుండా పోతుంది. ఇక తాజాగా యూట్యూబ్ ఛానెల్‌లో అశ్లీల కంటెంట్.. ప్రముఖ సింగర్‌కు వేధింపులు.. వ్యక్తి అరెస్ట్..
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సింగర్‌ను గత కొంతకాలంగా నవీన్ కుమార్ అనే వ్యక్తి వేధింపులకు గురి చేస్తున్నాడు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాలలో ఆమె పేరుపై అకౌంట్‌ను ఓపెన్ చేయడమే కాకుండా.. ఏకంగా సదరు గాయని ఫోటోతో ఫిల్మ్ ప్రొడక్షన్‌ను సైతం మొదలుపెట్టాడు. అంతటితో ఆగిన ఆ కేటుగాడు ఓ యూట్యూబ్ ఛానెల్‌లో గాయనిపై అశ్లీల కంటెంట్ అప్‌లోడ్ చేసేవాడు. ఈ విషయం సింగర్ కుటుంబానికి సన్నిహితుల ద్వారా తెలియడంతో వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇక సింగర్ రంగం లోకి దిగింది పలు సార్లు వార్నింగ్ ఇచ్చింది ఐన వినిపించుకోలేదు..ఇదిలా ఉంటే సదరు వ్యక్తికి ఫోన్ చేసి సోషల్ మీడియాలో తన పేరుపై పెట్టిన ఖాతాలను తొలగించాలంటూ సింగర్ కోరింది. ఆమె మాటలను పట్టించుకోని అతడు.. తాను చేసే పనులకు ఎన్ఓసీ ఇవ్వాలంటూ సింగర్‌ను బెదిరించాడు. దీనితో ఆ సింగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రాచకొండ పోలీసులు నిందితుడు నవీన్ కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.