3 లక్షలకు.. హిజ్రాతో పెళ్లి..
posted on Mar 19, 2021 @ 12:02PM
పుట్టుక, చావు, పెళ్లి, పిల్లలు, ఉద్యోగం ఈ అయిదు ఉంటేనే మనిషి జీవితం సంపూర్ణంగా ఉంటుంది. పుట్టుక, చావు రెండింటిలో మన ప్రమేయం ఉండదు. కానీ, పెళ్లి, పిల్లలు, ఉద్యోగం ఈ మూడింటిలో మాత్రం మన ప్రమేయం తప్పకుండ ఉంటుంది. వయసు దాటినా అమ్మాయికైనా, అబ్బాయికైనా పెళ్లి కాలేదంటే నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. నట్టుగాడని, మగాడు కాదని, మొగతనం లేదని , దోషం ఉందని చెప్పుకుంటారు. ఇక పెళ్లి కానీ అమ్మాయిల గురించైతే చెప్పనక్కర్లేదు. ఈ కాలంలో పెళ్లి కానీ అబ్బాయి తల్లిదండ్రుల బాధలు చెప్పుకోవడానికి ఆ ఇంటి గోడలు సరిపోవు.
ఒకప్పుడు పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు ఇంట్లో ఉంటె తల్లిదండ్రులు పెళ్లి చేస్తే తమ బాధ్యత తీరుతుందనుకునే వాళ్ళు. ఇప్పుడు పెళ్లీడుకొచ్చిన కొడుకు ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు కొడుక్కి పెళ్లి చేయాలనీ పరితపిస్తుంటారు. పెళ్లి వయసు కాస్తా దాటిపోతే పిల్ల దొరకదనో, తమ కొడుకు గురించి నలుగురు చెడుగా మాట్లాడుకుంటారు అనే భయంతోనో.. కారణం ఏదైనా గానీ కొడుకు పెళ్లి చూడాలని ఏ తల్లిదండ్రులకు మాత్రం ఉండదు చెప్పండి.
కొడుకుకి ఇంకా పెళ్లి కావడం లేదు అని బాధపడుతున్న తల్లిదండ్రులను చూడలేక శివ్ నరైన్. తనకు ఉన్న పొలం అమ్మి స్నేహితుడి చేతిలో మూడు లక్షలు పెట్టి పెళ్లి చేయమని కోసం ఒక వ్యక్తి. స్నేహితుడు పిల్లను చూశాడు. పెళ్లి చేశాడు. కానీ పెళ్లి అయినా తర్వాత అత్తారింటికి రావాల్సిన పెళ్లి కూతురు పారిపోయింది. ఆ తర్వాత తన తో పెళ్లి అయినా అమ్మాయి, అమ్మాయి కాదని తెలిసింది.
తన స్నేహితుడు కైలాసనాథ్ సాయం కోరాడు. స్నేహితుడికి కైలాస్‌నాథ్ శివ్ నరైన్‌కు ఓ పెళ్లి సంబంధం కుదిర్చాడు. అయితే.. బీహార్‌కు చెందిన ఆ యువతి చాలా పేదరికాన్ని అనుభవిస్తోందని, పెళ్లి చేసుకునేందుకు కూడా ఆమె వద్ద డబ్బుల్లేవని నరైన్‌కు కైలాసనాథ్ చెప్పాడు. దీంతో.. తన పొలంలో కొంత అమ్మగా వచ్చిన 3 లక్షలను నరైన్ కైలాస్‌నాథ్‌కు ఇచ్చాడు.
ఇటీవలే.. బీహార్‌లో శివ్ నరైన్‌కు, ఆ యువతికి పెళ్లి జరిగింది. తన పెళ్లికి సహకరించినందుకు కైలాసనాథ్‌కు శివ్ నరైన్ ధన్యవాదాలు చెప్పాడు. పెళ్లయ్యాక బీహార్ నుంచి కొత్తగా పెళ్లి చేసుకున్న తన భార్యతో కలిసి సొంతూరికి వచ్చేందుకు శివ్ నరైన్ ప్రయాణమవుతుండగా ఓ చేదు నిజం అతనికి తెలిసింది. భార్య కోసం ఎంత వెతికినా ఇంట్లో కనిపించలేదు. పెళ్లికి శివ్ నరైన్ కుటుంబం ఆమెకు చేయించిన బంగారంతో ఆమె ఉడాయించినట్లు తర్వాత తెలిసింది. భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేక కుమిలిపోతున్న శివ్ నరైన్‌కు మరో షాకింగ్ విషయం తెలిసింది. కైలాసనాథ్ కుదిర్చిన పెళ్లి సంబంధం అంతా ఒట్టి నాటకమని తెలుసుకున్నాడు.
అసలు శివ్ నరైన్ పెళ్లి చేసుకుంది అమ్మాయినే కాదు ఓ హిజ్రాని. ఈ విషయం తెలిసి శివ్ మరింత రగిలిపోయాడు. ఓ హిజ్రాను అడ్డం పెట్టుకుని స్నేహితుడి సొమ్ము కాజేసేందుకు కైలాసనాథ్ ఆడిన నాటకం ఇదని తెలిసి శివ్ తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. తనకు జరిగిన మోసానికి రగిలిపోయిన శివ్ నరైన్ కైలాసనాథ్‌ను కలిసి తన డబ్బు తనకు తిరిగివ్వాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఈ బెదిరింపులను కైలాసనాథ్ పట్టించుకోలేదు. కైలాసనాథ్ తనను మోసం చేసి తన సొమ్ము తిరిగివ్వలేదన్న కోపంతో రగిలిపోయిన శివ్ నరైన్ అతనిని చంపేశాడు. పెళ్లి చేసుకుని అత్తారింటిలో అడుగుపెడదామని భావించిన శివ్ నరైన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ సంఘటన కాన్పూర్ దేహత్ జిల్లాలోని దేవీపూర్ గ్రామంలో జరిగింది.