ముందు కొడుకు.. ఆ తర్వాత భార్య గొంతు కోసిన వ్యక్తి
posted on Jul 13, 2021 @ 12:34PM
మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం.. అది ఒక్కపాటి మాట.. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. ఇది ఇప్పటి మాట.. అదేదో తెలుగు సినిమాలో మాట్లాడుకోవడాల్ లేవు అన్నట్లు నేటి సమాజంలో బంధాలు లేవు.. బంధుత్వాలు లేవు అన్నట్లుగా తయారు అవుతున్నారు మనుషులు.. వాళ్ళు చేసే పనికి గాని.. వాళ్ళ విషయానికి గానీ అడ్డువస్తే చివరికి కన్నా వల్లనైనా చంపడానికి కూడా తెగపడుతున్నారు.. ఈ వార్తలు మనం నిత్యం వింటూనే ఉన్నాం.. చూస్తున్నాం.. తాజాగా ఓ వ్యక్తి తన కొడుకును భార్యను గొంతు కోశాడు ఓ తండ్రి.. మరి వివరాలు తెలుసుకుందామా ?
అది హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లా ఆ జిల్లానే రంగారెడ్డి జిల్లా.. సిటీకి చుట్టూ కుంది కాబట్టి దాదాపు అన్ని ప్రాంతాల్లో సిటీ కల్చర్ ఉంటుంది. ఎక్కడో కొద్దీ ప్రాంతం తప్ప.. అభివృద్ధి ఎక్కడ ఉంటాడో అక్కడే కొన్ని సమాజ వ్యతిరేక సంఘటనలు జరుగుతాయంటారు.. కుటుంబంలో తలెత్తిన గొడవలో, మరి మనస్పర్థలు వచ్చాయో కారణం ఏంటో తెలియదుగాని.. ఒక వ్యక్తి తన ఇంట్లో రక్తపుటేర్లు పారించాడు. మానవత్వాన్ని విడిచి అడవి జంతువుల ప్రవర్తించాడు.. ఒకరి తర్వాత ఒకరిని గొంతుకోసి చంపేశాడు.. ముందుగా తన కొడుకు గొంతు కోసి ఆ తర్వాత భార్యను కత్తితో పొడిచాడు. ఈ ఘటన భయానక ఘటన జిల్లాలోని మొయినాబాద్‌లో మంగళవారం ఉదయం వెలుగుచూసింది.
అయితే, తండ్రి జరిపిన దాడిలో కొడుకు ప్రాణాలు కోల్పోగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలికి చేరుకుని పోలీసులు ఆ హత్యలకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ భయానక దాడులకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ముందు వివిధ రకాల అనుమానాలు లేకపోలేదు..