ప్రేమించి పెళ్లి.. ఆ తర్వాత అబార్షన్.. కులం పేరుతో..
posted on Jun 5, 2021 @ 3:00PM
అతని పేరు సాయిరెడ్డి. ఆమె పేరు కృష్ణవేణి. వాళ్లిద్దరూ హైదరాబాద్ పరిచయం అయ్యారు. ఆ పరిచయం వాళ్ళను ప్రేమికుల్ని చేసింది. ఆ తర్వాత ఆ ప్రేమ పెళ్లిగా మారింది. రెండు సంవత్సరాలుగా కాపురం కూడా పెట్టారు. ఓ రోజు సాయిరెడ్డి తన భార్యను అతని ఇంటికి తీసుకెళ్లాడు. కృష్ణవేణి దళిత మహిళా అవ్వడంతో ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని సాయిరెడ్డి తల్లిదండ్రులు ఆమెను చిత్రహింసలు పెట్టడం స్టార్ట్ చేశారు. విషయం తెలుసుకుంటే ముందు పూర్తి వివరాలు తెలుసుకుందాం..
కృష్ణవేణి హైదదాబాద్ లోని ఓ సెల్ ఫోన్ సెంటర్ లో పని చేస్తుంది. అక్కడే నివాసం ఉంటున్న సాయిరెడ్డి తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరి పరిచయం మూడు ముళ్ళు ఏడు అడుగులు వేశారు. ఆ తర్వాత అక్కడే వారిద్దరు రెండు సంవత్సరాలుగా కాపురం పెట్టారు. గత సంవత్సరం కరోనా సమయంలో తన సొంత గ్రామం అయిన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం చీమలపాడు గ్రామానికి సాయిరెడ్డి వచ్చాడు. సాయిరెడ్డి ఊరి నీళ్లు పడగానే ఆది సినిమాలో హీరో కు తాను రాయలసీమ బిడ్డను అని గుర్తుకు వచ్చినట్లు.. అతనికి నేను రెడ్డి ని అని గుర్తుకు వచ్చిందో ఏమో.. అప్పటి నుంచి కృష్ణవేణి ని పట్టించుకోవడం మానేశాడు. దాంతో మనస్థాపం చెందిన యువతి ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు అతడిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. అప్పుడైనా మారుతాడు అనుకుంది ఆమె.. కసాయి వాడు మారుతాడు అని మనం ఎప్పుడు అనుకోవద్దు అని ఆమె అనుకుంటుండగానే. తనలో మరో ట్విస్ట్ ఇచ్చాడు తన భర్త అప్పటికే ఆమె నాలుగు నెలల గర్భవతి. నువ్వు అబార్షన్ చేయించకుంటేనే మా ఊరు తీసుకెళ్తానంటూ చెప్పడంతో ఆమె చేసేది లేక ఒప్పుకుంది. దీంతో ఆమెకు గర్బం తీయించాడు. కొన్ని రోజులకు అతడు ఆమెను తన సొంతూరుకు తీసుకెళ్లాడు. అమ్మాయిది వేరే కులం కావడంతో అబ్బాయి తరఫు తల్లిదండ్రులు ఆమెను కులం పేరుతో దూషించారు. ఇంట్లోకి రానివ్వలేదు. తన సొంత వ్యవసాయ పొలం వద్ద పదిరోజులపాటు ఉండమని చెప్పి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్దామని అతడు ఆమె కు మాయ మాటలు చెప్పి అక్కడే ఉంచాడు.
అతడు ఆమెను మళ్లీ పట్టించుకోకపోవడంతో సాయిరెడ్డి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసింది. తట్టుకోలేక పోయిన సాయిరెడ్డి అతడి కుటుంబసభ్యులు ఆమెను కులం పేరుతో దూషిస్తూ చిత్రహింసలు పెట్టారు. తీవ్రంగా హింసించి వర్షంలో ఆమెను గ్రామ చావిడి వద్ద పడేశారు. వర్షంలో తడుచుకుంటూ ఆమె ఆర్తనాదాలు పట్టించున్న నాథుడే లేడు. గ్రామానికి చెందిన దళితులు ఆమెకు అండగా నిలబడి ఆసుపత్రికి తరలించారు. సాయిరెడ్డి కుటుంబ సభ్యులు కొట్టిన దెబ్బలకు తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం నారాయణఖేడ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.
కట్ చేస్తే.. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కేవీపీఎస్ నాయకులు ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. నిత్యం ప్రజల కోసం పనిచేవర్జికి ఇలాంటి విషయం కొత్త ఏం కాదు. ఈ ఘటన తో అగ్రకుల పెత్తందారుల ఆగడాలు మరోసారి బట్టబయలైందని ఆరోపించారు. ఇది చాలా దారుణమని, దుర్మార్గమైనది.. ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేసి చిత్ర హింసలకు గురిచేసి హత్యాయత్నం చేసిన సాయిరెడ్డి వారి కుటుంబ సభ్యులందరినీ తక్షణమే అరెస్టు చేయాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం, నిర్భయ చట్టం కింద కేసులు పెట్టి చేసి వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. బాధిత అమ్మాయి కృష్ణవేణికి ప్రభుత్వమే కార్పొరేట్ వైద్యం అందించాలని, వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరించాలని, నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) సంగారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.