కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులు మృతి

ఆపరేషన్ కగార్ లో భాగంగా గత నెల 21 నుంచి కర్రెగుట్టల్లో జరుగుతున్న కూంబింగ్ లో భాగంగా ఇప్పటి వరకూ 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. కర్రెగుట్టల్లో జరుగుతున్న కూబింగ్ ఆపరేషన్ లో భాగంగా ఇంత వరకూ 35 ఎన్ కౌంటర్లు జరిగాయి. ఆ ఎన్ కౌంటర్లలో 31 మంది మావోయిస్టులు మరణించారు. ఈ వివరాలను బీజాపూర్ ఎస్పీ స్వయంగా ప్రకటించారు. మరణించిన నక్సలైట్లలో 20 మందిని గుర్తించినట్లు తెలిపిన ఆయన ఆ గుర్తించిన వారి భౌతిక కాయాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్ల చెప్పారు.

మరో 15 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. కాగా కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ లో 28 వేల మంది భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు వివరించారు.  ఇలా ఉండగా పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత ఉత్పన్నమైన పరిణామాలతో కర్రెగుట్టల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేసి భద్రతా దళాలను దేశ సరిహద్దులకు తరలించేసిన సంగతి తెలిసిందే. అయితే ఛత్తీస్ గఢ్ లో మాత్రం ఆపరేషన్ కగార్ యథాతథంగా సాగుతోంది. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా శివారులోని అటవీ ప్రాంతంలోనూ, అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని బామ్రాగఢ్ అడవుల్లోనూ ఒకే రోజు జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో మొత్తం 30 మంది నక్సల్స్ మరణించినట్లు సమాచారం.  అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Teluguone gnews banner