ఉద్యోగం కోసం.. వ్యభిచార*
posted on Mar 20, 2021 @ 11:39AM
ఉద్యోగం అవసరం ఉన్నవాళ్లే వాళ్ళ టార్గెట్. అందులోను ముఖ్యంగా అమ్మాయిలే. ఉద్యోగం పేరుతో నగరానికి వచ్చిన ఒంటరి అమ్మాయిలకు మాయమాటలు చెప్పి ట్రాప్ చేసి. వ్యభిచా* గృహాలకు పంపుతారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనం బతకాలంటే ఉద్యోగం కావాలి. ఉద్యోగం కోసం మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. మన అవసరాలను కొంత మంది కేటుగాళ్ళు కాష్ చేసుకుంటారు. మనకి ఉద్యోగం కావలి. మోసం చేసేవాడికి డబ్బు తో పాటు అవసరం కావాలి. అందుకు ఈజీగా మోసపోయేవాళ్లు కావాలి. అందుకే వాళ్ళు అమ్మాయిలను టార్గెట్ చేసుకున్నారు. ఉద్యోగం పేరుతో నగరానికి వచ్చిన కొంత మంది ఒంటరి అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుని మాయ మాటలు చెప్పి, మోసపుచ్చి వ్యభిచా* గృహాలకు చేరవేశారు ముగ్గురు డుందగులు.
గోపాలపురం ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ కథనం ప్రకారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సతీష్(28), వరంగల్‌కు చెందిన సురేష్(19), తూర్పుగోదావరికి చెందిన పవన్(20)లతో పాటు అఖిల్, తేజ, చరణ్ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఉద్యోగాల కోసం నగరానికి వచ్చే ఒంటరి మహిళలకు మాయమాటలు చెప్పి వ్యభిచా* కూపంలోకి దించేవారు. దిల్లీకి చెందిన ఓ యువతి(19)కి ఫేస్‌బుక్‌లో హైదరాబాద్‌లో ఉంటున్న మహిళ పరిచయమై ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పింది. ఆ యువతి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ రాగా ఆమెను సతీష్‌కు పరిచయం చేసింది. ఆమెను వ్యభిచా* వృత్తిలోకి దించేందుకు ప్రయత్నించగా తప్పించుకుని ఈనెల 11న పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం సతీష్, సురేష్, పవన్‌లను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
మనం ఉద్యోగం ఎందుకు చేస్తాం. తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా ఉందామనో, కుటుంబ పరిస్థితులు బాగాలేకానో .. సొసైటీలో బాగా బతుకుదామనో ఉద్యోగం చేయాలనుకుంటాం.. ఉద్యోగం చేయడం వెనక చాలా కారణాలే ఉండొచ్చు కారణాలు ఏవైనా అవసరం పీకల మీద ఉన్నపుడు వెనక వెనక ముందు ఆలోచించకుండా అప్పుడప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు ఎక్కడి వరకు దారితీస్తాయో తెలియదు. సో అందుకని ఆలోచించకుండా ఏ నిర్ణయాలు తీసుకోకండి.