పక్క ప్లాన్.. 27 కిలోల బంగారు చోరీ..
posted on Jun 10, 2021 @ 9:47AM
ఓ పక్క కరోనా, మరోవైపు బ్లాక్ ఫంగస్, ఇంకో వైపు ఎండ ప్రజలతో చెడుగుడు ఆడుతున్నాయి. సూర్యుడు ప్రచండ వేడితో ప్రజలపై తన ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం సంగతి దేవుడికి తెలుసు.. ఆ విషయం పక్కన పెడితే రాత్రి అయిన కొంచం చల్లగాలి రావడం లేదు. పల్లెటూరు అయితే కొంచమైనా చల్లగాలి వస్తుంది. చెట్లు ఉంటాయి కాబట్టి. అదే పట్నం లో అంయితే రాత్రి పగలు తేడాలేకుండా సెగలు కక్కుతోంది. ఫ్యాన్ లు, పంకలు ఏది తిరిగిన వేడి గాలే వస్తోంది. దీంతో కొన్ని చోట్ల భరించలేని ఉక్కపోతతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆ వేడి గాలులను.. ఉక్క పోతను భరించలేక. కాసేపు హ్యాపీగా నిద్ర పోదామని ఆరుబయటకు వచ్చి పడుకుంటే ఊహించని ఘటన జరిగింది. గాలికోసం ఇంటి ఆవరణలో పడుకుంటే.. ఇల్లు లూటీ అయింది. అలా నిద్ర పట్టిందో లేదో.. ఇలా ఇంట్లో బంగారాన్ని దోచుకెళ్లారు దుండగులు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకేరోజు.. రెండు ఇళ్లలో దొంగలు పడి.. విలువైన బంగారం దోచుకెళ్లారు. ఇంటికి తాళం వేయలేదు.. బీరువాకు తాళం వేయలేదు. కరోనా, కర్ఫ్యూ, ఈ సమయంలో దొంగలేం చేస్తారని ఆదమరిచారు. ఇల్లు గుల్ల చేసుకున్నారు.
అది విశాఖ. తాజాగా అర్ధరాత్రి జరిగిన దొంగతనాల తీరు పోలీసులు చెప్పిన పూర్తి వివరాల ప్రకారం ఇలా ఉంది. అక్కయ్యపాలెంలోని నగరం నడిబొడ్డున జగన్నాధపురం కాలనీలో ఇంట్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ సంఘటనలో 27 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఇంటి తలుపులు బార్లా తెరుచుకుని బీరువా తాళాలు కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంచడంతో దొంగల పని చాలా సులువైంది. దర్జాగా ఇంటి ముందరి గేట్ నుంచే ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడే బీరువాతాళాలు ఉండటంతో బీరువా తెరిచారు. 27 కిలోల బంగారు ఆభరణాలు, మూడు లక్షల నగదును ఎత్తుకుపోయారు. ఇదంతా లోకల్ గ్యాంగ్ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
బాధితుడు ఆయిల్ వ్యాపారం చేసుకునే కంచిపాటీ శ్రీనివాసరావు. కర్ఫ్యూ సమయంలో అందరూ ఇళ్లలోనే ఉంటున్నా.. ఈ తరహా ఘటన జరగడం విస్మయానికి గురిచేసింది. నిత్యం రాత్రి వేళల్లో తలుపులు బార్లా తెరుచుకుని పడుకున్న వారినే ఈ గ్యాంగ్ టార్గెట్ చేస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. రెక్కీ చేసి మరి అర్ధరాత్రి ఈ చోరీకి పాల్పడినట్లు ప్రాధమికంగా నిర్థారణకు వచ్చారు పోలీసులు. వేలిముద్రల నిపుణులు దొంగలకు చెందిన ఆధారాల సేకరణ చేపట్టారు. విశాఖ ఈస్ట్ జోన్ క్రైమ్ సిఐ సింహాద్రి నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహారాణి పేటలో కూడా ఈ తరహా చోరీయే జరిగింది. రాత్రి ఇంటి తలుపులు వేయకుండా బయట పడుకున్నారు. దీంతో దొంగలు ఈ ఇంట్లో 16 తులాలు బంగారు ఆభరణాలు దోచుకొన్నారు. బీరువా తాళాలు కూడా అందుబాటులో ఉండటం గమనార్హం. ఈ రెండిళ్లలో ఒకే తరహాలో చోరీ చేసింది ఒకే గ్యాంగ్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పక్కాగా రెక్కి నిర్వహించి.. ఇళ్లలో పరిస్థితి బాగా గమనించే ఇవి చేసినట్టు అనుమానిస్తున్నారు. గ్యాంగ్ రెండు గ్రూపులుగా విడిపోయి చోరీకి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. మహారాణి పేట సిఐ సోమ శేఖర్ దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి పనిలో ఒకడు ఉంటే.. పెళ్ళాం పని మీద ఒకడు ఉన్నటు.. ఈ ఎండాకాలం, అందులోను కరోనా అందరూ ఇంట్లో ఉన్నపుడే ఇలా చేశాడంటే ఆ దొంగ ఎంత చెలాకీ నో తెలుస్తుంది.. అందరూ జెర్ర భద్రం హలో అనే లోపు దొంగలు బులో అంటున్నారు..