మందు మానేశాడు.. ఊరంతా సన్మానం చేశారు..
posted on Jun 8, 2021 @ 1:53PM
వెంకటేష్ అనే నేను.. సినిమా కాదండోయ్ బాబు.. ఇది ఒక ప్రతిజ్ఞ.. ప్రతిఙ్ఞనంటే భారత దేశం నా మారారు భూమి.. భారతీయులందరు నా సహోదరులు అంటారు కూడా అని అనుకుంటున్నా.. అవును నిజమే.. అది దేశ పౌరుడిగా చేసి ప్రతిజ్ఞ.. ఇది మందు బాబు చేసే ప్రతిజ్ఞ అందుకే ఇలా ఉంటుంది.. అసలు ఆ వెంకటేష్ ఎవరు..? అతడు మందు మానేస్తే ప్రతిజ్ఞ చేయడం ఏంటి.. అందులో ఏ న్యూస్ రాయడం ఏంటి..? మొత్తానికి మాకు ఈ నసేంటని అనుకుంటున్నారా..? కొంచం ఓపిక పట్టి కింది లైన్ కూడా చదవండి మీకే తెలుస్తుంది..
నేను ఐఏఎస్ అవుతాను, నేను డాక్టర్ అవుతాను అని ప్రతి మనిషికి గోల్స్ ఉండడం వేరు.. నేను మందు మానేస్తాను అదే నా గోల్ అనే వాడిని ఎపుడైనా చూశారా.. చూడండి అయితే.. నెల్లూరు జిల్లా, బుజ్జిరెడ్డి పాలెం మండలం, చల్లాయపాలెం. ఈ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి . అతని పేరు వెంకటేష్. అతను కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 25 ఏళ్ల ఆ వెంకటేష్ తనకు వచ్చే కూలి డబ్బంతా మద్యం తాగుడుకే తగలేసేవాడు. రోజు పనికెళ్ళడం ఆ డబ్బులతో మందెయ్యడం.. ఆ తర్వాత చిందేయ్యడం.. ఊరోలో అందరు చాలా చెప్పి చూశారు అయిన వెంకటేష్ లో ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా ఏం జరిగిందో ఏమో.. వెంకటేష్ సడెన్ గా మందు మానేశాడు.. ఆ వార్త విన్న ఆ ఊరి జనం.. ఒక రకంగా పండగ చేసుకున్నారనే చెప్పాలి.. అతను మందు మానెయ్యడంతో ఆ ఊరివాళ్లంతా సంతోషించారు. వెంకటేష్ మందు మానేశాడ్రోయ్ అంటూ చాటింపు వేశారు.
ఎప్పుడూ తాగుతూ, తూలుతూ కనిపించే వెంకటేష్ ఉన్నట్లుండి మద్యం తాగడం మానేయడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆనందించారు. అతనిని మరికొందరు స్ఫూర్తిగా తీసుకుని మద్యం మానుకుంటే బాగుంటుందని ఆశించారు. ఇందులో భాగంగా వెంకటేష్‌ను మేళతాళాలతో ఊరంతా ఊరేగించారు. అంతే కాదు ఆ ఊరిలో ఉన్న గుడిలో వెంకటేష్ దేవుడి సాక్షిగా ఇంకెప్పుడు మందు జోలికి వెళ్లానని ప్రమాణం చేశాడు.. ప్రతి సంవత్సరంలో 3 రోజులు తప్పా మరే ఇతర రోజుల్లో మాత్రమే మందు తాగాను అని దేవుడి గుడిలో మొక్కాడు మందు మానేసిన వ్యక్తి కి ఊరంతా ఊరేగించి సన్మానం చేశారు. కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి అలాంటి యువకుడు ఉన్నట్టుండి తాగుడు మానేయడంతో