భార్య ఆ విషయాన్నీ దాచింది.. భర్తకు తెలిసింది చివరికి అదే జరిగింది..
posted on Jun 23, 2021 @ 10:24AM
కొంచెం జరగరా నాకు కొంచం స్పేస్ కావాలి. ఈ డైలాగ్ విని ఉంటారు. ఈ మాట తరుచు మనం ప్రయాణం చేసేటప్పుడు, లేదంటే జనం బాగా రద్దీగా ఉన్న చోట వింటుంటాం. అయితే అలాంటి టైం లో ఇలాంటి మాటలు సహజం కానీ.. పెళ్లి అయి రెండు నెలలు గడుస్తున్నా.. భార్య, తన భర్త స్పేస్ కావాలని చెప్పడం ఎక్కడైనా చూశారా.. ? అలా తన భార్య అన్న మాటకు ఆ భర్తకు అనుమానం వస్తే.. ఏం జరుగుతుంది ? ఆ తర్వాత భార్య ఎందుకు ఇలా చేస్తుందని ఆరా తీస్తే.. అప్పుడు ఇన్ని రోజులు భార్య దాచిన విషయం భర్తకు తెలిస్తే.. ఆ నిజం తెలిసిన భర్త ఎలా ఫీల్ అవుతాడు. ఆ నిజం భర్త జీర్ణించుకోకుంటాడు. ఇంతకీ ఆ విషయం ఏంటో తెలుసుకోవాలని మీకు కూడా అనిపిస్తుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం ముందుకు పదండి తెలుసుకుందాం.
కాన్పూర్ నగర నివాసి అయిన యువకుడు శాస్త్రినగర్ లోని పంకి ప్రాంతానికి చెందిన యువతిని ఏప్రిల్ 28వతేదీన వివాహమాడారు. వివాహం అనంతరం వరుడు వధువుతో శారీరక సంబంధం ఏర్పరచుకోలేక పోయాడు. పెళ్లి చేసుకున్నాక భార్య భర్తల మధ్య శారీరక సంబంధం సాధారణం. కానీ ఓ భర్త పెళ్లై రెండు నెలలు అవుతున్నా భర్తను దగ్గరికి రానివ్వడం లేదు, భార్య అలా అనడం వెనక ఏదో కారణం ఉంటుందని ఆ భర్త కూడా భార్యతో శారీరక సంబంధం ఏర్పరచుకోలేకపోయాడు. కొన్ని నెలలు వెయిట్ చేశాడు. ఆ తర్వాత సహనం కోల్పోయిన భర్త ఆమెను పరీక్షల నిమిత్తం డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. దీంతో భార్యను పరీక్షించిన డాక్టర్ ఆమె హిజ్రా అని తెలిపింది. దీంతో షాక్ తిన్న భర్త.. భార్య తరపు బంధువులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లింగమార్పిడి చేసి అమ్మాయి అని చెప్పి తనతో వివాహం జరిపించారని, మోసం చేసిన అత్తమామలపై కేసు పెట్టాలని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అత్తమామలతో పాటు 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఇన్ స్పెక్టర్ చెప్పారు. తన భార్య లింగమార్పిడి చేయించుకుందని, ఆమె జననాంగాలు పూర్తిగా అభివృద్ధి చెందలేదని గుర్తించి ఆమెను వైద్య పరీక్ష కోసం గైనకాలజిస్టు వద్దకు తీసుకువెళ్లాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో వెలుగుచూసింది.