19 ఏళ్లకే.. 3 హత్యలు..
posted on Mar 19, 2021 @ 3:20PM
పెద్దలే కాదు పిల్లలు కూడా క్రైమ్ చేస్తున్నారు. అభం శుభం తెలియని వారిని హత్యలు చేస్తున్నాడు. సినిమాల ప్రభావమే తాము పెరిగిన వాతావరణమో లేక తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చిన అలవాటులో తెలియదు గానీ.. ఓ పిల్లవాడు మరి క్రూరంగా మారాడు. 19 ఏళ్ళ వయసులోనే ముగ్గుర్నిచంపేశాడు.
వాడు మగడు..కానీ మగాలపైనా కన్నేసిన కిరాతకుడు.. చిన్నవయసులోనే క్రూరత్వాన్ని అక్షరాభ్యాసంగా చేసుకున్నాడు. తోటి బాలురపై కన్నేయడం కిడ్నాప్ చేసి వారిపై లైంగిక దాడి చేయడం వాడి వృత్తిగా మార్చుకున్నాడు. అది వాడికి చిన్నప్పటి వెన్నతో పెట్టిన అలవాటుగా మారింది. ఇక అంతే 14 ఏళ్ల వయసుకే ఆ ఊరిలో అందరికి స్పైడర్ చూపించాడు. చివరికి తన స్నేహితుడ్నే చంపేశాడు. ఇలా ఐదేళ్లలో ముగ్గురిపై అఘాయిత్యానికి పాల్పడి వారి నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు.
ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం, మెల్లంపూడి గ్రామాల్లో నెలరోజుల వ్యవధిలో ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. మెల్లంపూడి గ్రామంలో ఈనెల 14న భార్గవతేజ అనే బాలుడు అదృశ్యమై హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.
ఈ ఘాతుకానికి పాల్పడింది అదే గ్రామానికి చెందిన మెల్లంపూడి గోపయ్య అలియాస్ గోపీ అనే 19 యువకుడిగా గుర్తించారు. అనుమానంతో అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు విచారించగా.. పోలీసులకే షాకిచ్చే నిజాలు వెల్లడించాడు. ఇంటిముందు ఆడుకుంటున్న భార్గవతేజకు మాయమాటలు చెప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి తీసుకెళ్ళీ కాళ్లు చేతులు కట్టేసిభార్గవతేజ లైంగిగ దాడి జరిపినట్లు తెలిపాడు. లైంగిక దాడి తర్వాత అతడ్ని తీవ్రంగా కొట్టి హత్య చేశానని, ఆ తర్వాత మృతదేహం కాళ్లు, చేతులు విరిచినట్లు.. ముఖాన్ని చెక్కేసి సమీపంలోని సమీపంలోని అరటితోటలో పడేశానని పోలీసుల ముందు తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు.
గతంలో ఇదే తరహాలో మరో నేరం :
గత నెల 11వ తేదీవ వడ్డేశ్వరం గ్రామానికి చెందిన మరియదాసు, మీనాక్షిల కుమారుడు అఖిల్ మధ్యాహ్నం సమయంలో అదృశ్యమయ్యాడు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసినా అఖిల్ ఆచూకీ లభించలేదు. దీంతో ఆకేసు గురించి కూడా గోపీని ఆరా తీయగా.. తానే కిడ్నాప్ చేసి లైంగిక వాంఛ తీర్చుకొని చంపేసినట్లు అంగీకరించాడు.
నిందితుడు గోపీలో సైకో లక్షణాలున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడు 14ఏళ్ల వయసులోనే తన ఫ్రెండ్ ని సెకండ్ షో సినిమాకు తీసుకెళ్లి.. మధ్యలోనే బయటకు తీసుకొచ్చిఅతడిపై లైంగిక దాడి చేసి చంపేశాడు. మృతదేహాన్ని రేవేంద్రపాడు బ్రిడ్డిపై నుంచి కాలువలో పడేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో వివాదం ఎందుకులే అని స్థానికులు వదిలేసినట్లు తెలుస్తోంది. గోపీ తండ్రిది కూడా నేర ప్రవృత్తేనని గ్రామస్తులు చెబుతున్నారు. అతడు మొదటి భార్యను హత్య చేసిన కేసులో 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.