Read more!

కడుపులో నాణేల గుట్ట!

అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన యువకుడికి ఎక్సరే తీసిన డాక్టర్లకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. అతడి కడుపులో ఏకంగా 187 నాణేలు కనిపించాయి. పొట్టలో అన్ని నాణేలు ఉండటం వల్లనే ఆ యువకుడు తరచూ వాంతులూ, కడుపు నొప్పితో బాధపడే వాడు. ఆ బాధకు కారణమేమిటని ఆస్పత్రికి వెడితే కడుపులో నాణేల గుట్ట ఉందని బయటపడింది. వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఆ నాణేలను బయటకు తీశారు. ఇంతకీ అతడి కడుపులోకి అన్ని నాణేలు ఎలా వచ్చాయంటే.. ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఆ నాణేలన్నిటికీ అతడే మిగేశాడు. విచిత్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్న అతగాడు అతనికి తెలియకుండానే నాణెం కనిపిస్తే గుటుక్కున మింగేస్తాడు. నాణేలను బయటకు తీసిన తరువాత ఆ యువకుడు కోలుకుంటున్నాడు. అయితే మళ్లీ మళ్లీ ఇదే సమస్య ఉత్పన్నమౌతుందని డాక్టర్లు అంటున్నారు. నాణేలను కడుపులోంచి తీసేసి చికిత్స చేసినంత మాత్రాన అతడు కోలుకున్నట్లు కాదనీ, ముందు అతడి మానసిక రుగ్మతకు చికిత్స చేయాలని వైద్యులు చెబుతున్నారు.