గుర్రం అంత్యక్రియలకు వేలసంఖ్యలో జనం..
posted on May 24, 2021 @ 2:40PM
ప్రపంచంలో కరోనా విలయం అంత ఇంత కాదు. ఇక మన దేశంలో అయితే చెప్పనక్కర్లేదు. మరణాలు చెట్టు మీద పిట్టల ఎగిరిపోతున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో మరణాలు విపరీతంగా నమోదు అవుతున్నాయి. కరోనా మరణాలు ఒక వైపు అయితే.. ఆ శవాలను పట్టుకోవడానికి సొంతవారు కూడా ఇష్టపడడం లేదు. కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు కూడా రాలేకపోతోన్న రోజులివి. అది అందరికి అందుకని అనుకుంటున్నారా..? సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ల కరోనాతో మనుషులు చనిపోతే అతి తక్కువ మందితోనే అంత్యక్రియలు పూర్తి చేసేందుకు అనుమతి ఉంది. మరోవైపు కరోనాతో చనిపోయిన శవాలను తగలబెట్టడానికి స్మశానాలు కూడా కాళీ లేవు. కానీ అటువంటిది ఓ గుర్రం చనిపోతే వందలాది మంది కదిలి వచ్చారు. అది కూడా కరోనా టైం లో లోక్ డౌన్ నిబంధనలు పక్కన పెట్టి మరి వచ్చారు. ఇంతకీ ఆ గుర్రానికి ఉన్న స్పెషల్ ఏంటి..? కలిసి కరోనా నిబంధనలు పాటించకుండా అంత్యక్రియలు చెయ్యడమంటే మాములు విషయం కాదు. కర్ణాటకలోని బెళగావిలోని మరాడిమట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనపై కర్ణాటక హోం శాఖ మంత్రి బసవరాజ్ స్పందిస్తూ... జిల్లా అధికారులు ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నారని, నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, బెళగావిలోని మరాడిమట్ ప్రాంతంలోని ఓ ఆశ్రమంలో సిద్ధేశ్వర మఠానికి చెందిన ఆ గుర్రాన్ని దేవతా అశ్వంగా గ్రామస్థులు భావిస్తారు. ఈ నేపథ్యంలోనే దాని అంత్యక్రియలకు పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చారు.