మాన్సస్ ఆస్తులే లక్ష్యంగా విజయసాయిరెడ్డి స్కెచ్?
posted on Jul 6, 2021 9:12AM
తస్మదీయులను తొలగించి..అస్మదీయులను అందలమెక్కిస్తే చాలు.. మన పని అయిపోతుందనుకున్నారు. అస్మదీయురాలిని పీఠంపై కూర్చోబెట్టిన దగ్గర నుంచి..ఎక్కడెక్కడ ఏ ఆస్తులున్నాయి..ఏ భూములున్నాయి.. ఏవి ఎలా కొట్టేయాలి అని తెగ వ్యూహాలు రచించేశారు. డామిట్ కథ అడ్డం తిరిగిందన్నట్లు.. న్యాయస్థానం వీళ్ల అర్ధరాత్రి జీవోలను రద్దు చేయటంతో కథ మొదటికొచ్చింది. అస్మదీయురాలు పదవి పోగొట్టుకుంది...వీరి పెత్తనం పోయింది. అందుకే ఇప్పుడు ఆఖరి అస్త్రం తీశారు. విచారణ పేరుతో ఆదేశాలిచ్చారు. అక్కడ అక్రమం జరిగింది.. ఇక్కడ జరిగిందంటూ త్వరలో రిపోర్టు వస్తుంది. మళ్లీ తస్మదీయుడిని ఆ పేరుతో తొలగించేస్తారు. అక్రమాలను సరి చేసే పేరుతో భూములను ప్రభుత్వం చేజిక్కించుకునే ప్లాన్ నడుస్తోంది. ఆ తర్వాత వాటిని తమకిష్టమైనవారికి.. తమకు ఇచ్చుకున్నవారికి లీజు మీద ఇచ్చేస్తారు.
ఇదంతా మాన్సస్ ట్రస్ట్ కథ. అవును... ముందు అశోక్ గజపతిని తొలగించి..సంచయితను పదవిలో కూర్చోబెట్టి.. ఆ తర్వాత వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవచ్చునుకున్నారు. అలాగే చేశారు కూడా. అటు సింహాచలం..ఇటు మాన్సస్ ఆలయాల ఆస్తులు, ఇతర వ్యవహారాలన్నీఆరా తీశారు. సింహాచలం భూములను వేలం వేయాలనుకున్నారు.. మాన్సస్ కింద ఉన్న ఓ కాలేజీ గ్రౌండ్ ను లేపేయాలనుకున్నారు. అన్నీ వేల కోట్ల విలువైన భూములే. తామనుకున్నట్లే పని అయిపోతుందనుకున్నారు. కాని హైకోర్టు వీరి జీవోలను కొట్టేయడంతో సంచయిత పదవి కోల్పోయింది. అశోక్ గజపతి రాజు మళ్లీ పదవిలోకి వచ్చేశారు. దాంతో ప్లాన్ బీ మొదలెట్టారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే ఇదే పని మీద కూర్చున్నట్లు చెప్పుకుంటున్నారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి అయినప్పటికి..కేవలం సంతకాలకే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. అంతా విజయసాయిరెడ్డే నేరుగా అధికారులతో కోఆర్డినేట్ చేస్తూ మాన్సస్ వ్యవహారాలపై వేగంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. లేటెస్టుగా సింహాచలం దేవస్థానంతో పాటు..మాన్సస్ కింద ఉన్న అన్నిఆస్తుల వ్యవహారంపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ శాఖ అధికారినే విచారణాధికారిగా నియమించారు. అంటే ఇక ఆ అధికారి కూడా ఎంపీగారు చెప్పినట్లు చేయాల్సిందేనన్న మాట.
బహుశా ఇప్పటికే నివేదిక వీళ్లే టైప్ చేసి తయారు చేసేసి ఉంటారు. ఆ అధికారితో సంతకం చేయించి రిలీజ్ చేయిపిస్తారు. ఆ తర్వాత ఇక అశోక్ గజపతి రాజును తొలగించడానికి దానిని వాడతారు..నివేదికలో భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే మంచిదని చెప్పిస్తారు..ఇంకేముంది భూములన్నీ ఏపీ ప్రభుత్వం చేతికి..తర్వాత వారి ద్వారా ఏదో ఒక కార్పొరేట్ కంపెనీకి..అలా భూమిని తిప్పేస్తే..వీరి ఖాతాల్లోకి డబ్బులొచ్చి పడతాయి కదా..ఇప్పుడదే ప్లాన్ నడుస్తుందని.. కొందరు ఆరోపిస్తున్నారు.