భార్య, తమ్ముడి తలలు నరికి కావడి కట్టాడు...
posted on Aug 19, 2014 @ 11:52AM
తోడబుట్టిన తమ్ముడిని, కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి దారుణంగా చంపాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి తలలను ఓ కర్రకి అటూ ఇటూ కావడిలాగా కట్టాడు. తాపీగా 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు. రెండు మర్డర్లు చేసినా చాలా కూల్‌గా వున్న అతన్ని చూసి పోలీసులు, జనం హడలిపోయారు. విశాఖపట్నం జిల్లా గొప్పులపాలెంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే, చెదల గుండన్న, జానకమ్మ (36) భార్యాభర్తలు. అయితే జానకమ్మ మూడు రోజుల క్రితం గుండన్న తమ్ముడు నారాయణ (40)తో వెళ్ళిపోయి పొరుగూరిలో కాపురం పెట్టింది. దాంతో ఆగ్రహించిన గుండన్న తమ్ముడు నారాయణ పొలంలో ఉండగా కత్తితో వెళ్లి నరికి చంపాడు. తమ్ముడి తలను మూటగట్టుకునిభార్య జానకమ్మ వద్దకు వెళ్లాడు. ఆమెను కూడా హతమార్చి ఆమె తలను కూడా శరీరం నుంచి వేరు చేసి, రెండు శిరస్సులనూ కావడి కట్టి 20 కిలోమీటర్ల దూరంలో పాడేరులోగల హుకుంపేట పోలీస్ స్టేషన్ వరకూ తాపీగా నడుచుకుంటూ వెళ్ళి లొంగిపోయాడు.