విమానంలో బాంబు.. చివరికేమైంది?
posted on Jul 1, 2014 @ 3:23PM
సోమవారం రాత్రి.. కేరళలోని కోచి నుంచి ఢిల్లీకి వెళ్ళే ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఎయిర్‌బస్ 320 ప్రశాంతంగా టేకాఫ్ తీసుకుంది. వెన్నెల్లో మెరుస్తున్న వెండి మబ్బుల మధ్య నుంచి విమానం స్మూత్‌గా ప్రయాణిస్తోంది. ఆ విమానంలో వున్న 156 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది ఫ్లయిట్ సిబ్బంది ఇంకో రెండు గంటల్లో హాయిగా ఢిల్లీకి వెళ్ళిపోతున్నాం అనుకున్నారు. కానీ అంతలోనే కథ ఒక మలుపు తిరిగింది. ప్రస్తుతం గాల్లో వున్న విమానంలో బాంబులు వున్నాయని, కాసేపట్లో అవి పేలబోతున్నాయని, గాల్లో ఎగిరిన విమానం గాల్లోనే పేలిపోతుందని కోచి ఎయిర్ పోర్టుకి ఒక అపరిచిత ఫోన్ కాల్ వచ్చింది. అంతే, వెంటనే గాల్లో వున్న విమానాన్ని ఎమర్జె్న్సీ లాండింగ్‌కి ఎయిర్‌పోర్ట్ అధికారులు ఆదేశించారు. దాంతో అప్పటికప్పుడు ఆ విమానాన్ని దగ్గర్లో వున్న బెంగుళూరు ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ లాండింగ్ చేశారు. బాంబ్ స్క్వాడ్ వచ్చి విమానంలోని ప్రయాణికులందర్నీ కిందకి దించేసి విమానం మొత్తం అంగుళం కూడా వదలకుండా వెతికింది. విమానంలో బాంబుల తాలూకు జాడలేవీ కనిపించలేదు. దాంతో వచ్చిన ఫోన్ కాల్ ఫేక్ కాల్ అని నిర్ధారించుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.