టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి కన్నుమూత
posted on Jul 27, 2012 @ 1:56PM
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్నఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన మంత్రిగా పని చేశారు. 1983-1999 వరకు ఆయన వరుసగా ఐదుసార్లు గెలుపొందారు. బీవీ మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. రాజకీయ జ్యోతిష్యాల్లో దిట్టగా ఆయనకు పేరుంది. ఎన్టీఆర్ కుటుంబంతో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది.