బ్యాంక్‌లపై జరిమానా
posted on Jul 16, 2013 @ 10:46AM
రూల్స్‌ను పక్కన పెట్టిన బ్యాంక్‌లపై చర్యలు మొదలు పెట్టింది ఆర్‌బిఐ.. నోయువర్ కస్టమర్, యాంటీ మనీలాండరింగ్ నిబందనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించిన 22 బ్యాంకులకు దాదాపు 50 కోట్ల రూపాయల వరకు జరిమాన విధించింది..
ఎస్‌బిఐ, పిఎన్‌బి, యస్ బ్యాంక్‌తో పాటు చాలా బ్యాంక్‌లు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.. అంతే కాదు సిటిబ్యాంక్ లాంటి మరి కొన్ని సంస్ధలను భవిష్యత్తులో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని హెచ్చరిస్తూ లేఖలను కూడా పంపింది..
ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో మనీలాండరింగ్ పెద్ద ఎత్తున జరుగుతోందంటూ ఆన్‌లైన్ పోర్టల్ కోబ్రాపోస్ట్ ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో దశలవారీగా స్టింగ్ ఆపరేషన్‌తో బయటపెట్టింది. దీనిపై దర్యాప్తునకు ఆదేశించిన ఆర్‌బిఐ ఇందులో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఐసిఐసిఐ, యాక్సిక్ బ్యాంకులలో యాంటీ మనీలాండరింగ్, కెవైసి నిబంధనల ఉల్లంఘన జరిగిందని వాటికి రూ.10.50 కోట్ల జరిమానా విధించింది.
ఇప్పుడు మరికొన్ని బ్యాంక్‌లపై కూడా చర్యలు చేపట్టింది. 22 బ్యాంకులలో ఖాతాల నిర్వహణ, పుస్తకాలు, అంతర్గత నియంత్రణ, నిబంధనల అమలు తీరు తదితర వివరాలను ఆర్‌బిఐ విచారణ బృందం ఏప్రిల్‌లో సమగ్రంగా పరిశీలించాక కెవైసి/యాంటీ మనీలాండరింగ్ నిబందలను సదరు బ్యాంక్‌లు ఉల్లంగిచాయని తేల్చింది. ఇవే కాదు ఇలాగే భవిష్యత్తులో మరిన్ని బ్యాంక్‌లపై ఆర్‌బిఐ చర్యలకు రెడీ అవుతుంది..