పేదలకు సమాజంలో గుర్తింపు లేదు: రాహుల్
posted on Apr 4, 2013 @ 4:46PM
ఢిల్లీలో జరుగుతున్న సిఐఐ వార్షిక సదస్సులో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ భారత్‌లో ఉన్నన్ని సహజవనరులు ఎక్కడా లేవన్నారు. అలాగే దేశంలో మేధావులకు, నిపుణులకు ఏమాత్రం కొదువ లేదన్నారు. కొన్నేళ్లుగా భారత్ పారిశ్రామికరంగంలో దూసుకుపోతోందన్నారు. దేశ అభివృద్ధికి రోడ్లు, రవాణా, విద్యుత్ చాలాకీలకం అన్నారు. పేద ప్రజలకు సమాజంలో ఏమాత్రం గుర్తింపు లేదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఐదేళ్లలో భారత కార్పోరేట్ రంగం కష్టపడి పనిచేసిందని రాహుల్ అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు కార్పోరేట్ రంగం సహకారం అవసరమని, మౌలిక సదుపాయాలు వృద్ధి చేయకుండా ముందుకు వెళ్లడం అసాధ్యమన్నారు. విద్యారంగంలో సమూల మార్పులు అవసరమని, ప్రపంచ స్థాయి విద్య మన పిల్లలకు అందించాలని రాహుల్ వెల్లడించారు. యుపిఏ పాలనలో దేశం చాలా అభివృద్ధి చెందిందని రాహుల్ చెప్పారు.