మూడు పెళ్లిళ్లు.. నిత్య పెళ్లికూతురు అరెస్ట్..
posted on Jul 14, 2021 @ 6:23PM
కథలు రచయితలే. సినిమాలు దర్శకులే చూపించరు. మోసాలు తెలిసిన వల్లే చేయరు తెలియని వాళ్ళు కూడా చేస్తారు. అప్పుడప్పుడు సామాన్య ప్రజలు కూడా చూపిస్తారు. తాజాగా నిత్య పెళ్లికూతురు సుహాసినిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు, కొత్తగూడెం, తిరుపతిలకు చెందిన ముగ్గురిని సుహాసిని పెళ్లి చేసుకొంది. మూడో భర్త సునీల్ ఫిర్యాదు మేరకు మూడు పెళ్లిళ్ల విషయం వెలుగు చూసింది. ముందు అనాధని అంటూ దగ్గరైంది. ఆదరించామని కోరుకుంది. నిలువెత్తు మనిషిని నిలువునా ముంచేసి.. మస్కా మాయ చేసింది ఓ కిలాడి లేడీ. ఏడునామాలవాడు రెండు పెళ్లిళ్లు చేసుకున్నట్లు.. కృష్ణుడు 8 మందిని అఫీషియల్ పెళ్లి చేసుకున్నట్లు.. ఈ లేడీ కూడా అనఫీషియల్ గా ఒకటి, రెండు కాదు.. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుందో నిత్య పెళ్లికూతురు. చిత్తూరు జిల్లాలోని విజయపురం మండలం నారపరాజు కండ్రికకు చెందిన సునీల్ కుమార్.. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. అతనికి సుహాసిని అనే యువతి పరిచయం ఐంది.. ఆ తర్వాత అనాధను అంటూ నమ్మపలికింది చేసుకుంది. ఎవరూ లేరని చెప్పడంతో జాలి చూపించిన సునీల్ కుమార్ ఆ అనాధ అమ్మాయికి అండగా నిలవాలనుకున్నాడు. ఆమెకు జీవితాన్ని ఇచ్చి అందరికి ఆదర్శనంగా నిలవాలనుకున్నాడు..
సునాసిని మాటలు త్రివిక్రమ్ సినిమాలో మాటల్లా సునీల్ గుండెకు తగిలాయి. అతని మనసు కరిగింది. ఆమెకు జీవితాన్ని ప్రసాదించాలని నిశ్చయించుకున్నాడు. గతేడాది డిశంబర్ లో పెళ్లి కూడా చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగింది. కానీ ఏమైందో ఏమో తెలియదు గానీ ఈ నెల 7న సునీల్ తో గొడవపడిన సుహాసిని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో.. భార్య కోసం ఆరా తీశారాయన. అప్పుడే ఆ కిలాడీ లేడీ అసలు రంగు బయటపడింది. సుహాసిని తనతో ఆడింది నాటకం అని ఆమెకు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుందని తేలింది. ఆమె నిత్య పెళ్లి కూతురని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఏం చేయాలో తెలియక అలిపిరి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు. భార్యగా నటిస్తూ తన దగ్గర సునీల్ నుంచి ఆరు లక్షలు కాజేసిందని బాధితుడు ఆరోపిస్తున్నాడు.
నెల్లూరు జిల్లా కోనేటి రాజుపాలెంకు చెందిన వెంకటేశ్వర్లును పెళ్లి చేసుకున్న సుహాసినికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తేలింది. ఏడాదిన్నర క్రితం మరో యువకుడిని రెండో పెళ్లి చేసుకొని 7 నెలల క్రితం.. సునీల్ చేత మూడు ముళ్ళు వేయించుకుని మూడో పెళ్లి చేసుకుంది.. ఆ మాయ లేడీ. బాధితుడి ఫిర్యాదుతో.. నిందితురాలి కోసం గాలింపు చేపట్టగా.. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నట్టు గుర్తించారు. నేటి సమాజంలో ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో అర్థం కావడం లేదు.. మీకు కూడా ఎవరైనా ఎలాంటి వాళ్ళు ఎదురైతే కొంచెం ఆలోచింది.. వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకుని నిర్ణయాలు తీసుకోండి..