పవన్ కళ్యాణ్ ఇంట్లో 'టీ' తాగిన చంద్రబాబు
posted on Apr 23, 2014 @ 12:27PM
నిన్నటి వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎడమొహం పెడమొహంగా వున్నారని అందరూ అనుకున్నారు. నిన్న మోడీ సభలో కూడా చెరోవైపు చూస్తూ వుండటంతో ఇద్దరి మధ్య గ్యాప్ పోలేదని చాలామంది అనుకున్నారు. అయితే ఈ అనుకోవడాలకి ఫుల్ స్టాప్ పెట్టే ఉద్దేశంతో ఇద్దరూ వున్నట్టున్నారు. అందుకే ఇద్దరూ సమావేశమయ్యారు. చంద్రబాబు పెద్ద మనసు చేసుకుని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి, ఆయన ఇంట్లో వేడివేడిగా కాచిన టీ తాగారు. టీయే తాగారని ఎలా తెలుసు? కాఫీ తాగి వుండొచ్చు కదా అనే సందేహం రావొచ్చు. కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి ‘తేనీటి విందు’కు వెళ్ళారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. టీ తాగాక ఇద్దరూ తమమధ్య వున్న గ్యాప్‌ను తొలగించుకోవడానికి చర్చలు జరిపినట్టు సమావేశం. మోడీ కోరినందువల్లే వీరిద్దరూ ఇలా కలసి టీ తాగారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.