పవన్ తో జూనియర్ కి చెక్..!
posted on Oct 22, 2013 @ 11:56AM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాగైనా టిడిపి వైపు వచ్చేలా ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలోని గుంటూరు, ఖమ్మం, కృష్ణా జిల్లాలలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు దర్శన మిస్తున్నాయి. ఇక ఇంటర్ నెట్ లోనూ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నాడని వీరి ఫోటోలతోనే ప్రచారం జరుగుతోంది. వీటిని ఎవరూ ఏర్పాటు చేస్తున్నారు? రాజకీయ రంగంలో చంద్రబాబుకు ఒక లెక్కుంది. సినీ రంగంలో పవన్ కల్యాణ్‌కు పవరుంది. చంద్రబాబు లెక్కకి, పవన్ కల్యాణ్ పవర్‌కు నందమూరి నటసింహం బాలయ్య తోడైతే ఎదురేముంది?అన్న ఫ్లెక్సీలు పెట్టడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
జగన్ ఫ్లెక్సీల విషయం, రాజకీయ విభేదాలతో టిడిపికి దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ కు చెక్ పెట్టాలనే ఆలోచనతో ...పవన్ టిడిపికి అనుకూలమన్న ప్రచారంతో భర్తీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోదంటున్నారు. అందుకే ఒక పద్దతి ప్రకారం పవన్ కళ్యాణ్ బాలయ్యకు సన్నిహితుడని, ఇక కాంగ్రెస్ మీద కోపంతో ఆయన టీడీపీలో చేరుతున్నారన్న ప్రచారంతో మెల్లగా ఫ్లెక్సీల వరకు లాక్కొచ్చారన్న ప్రచారం మెగా అభిమానుల్లో సాగుతుంది.
కాని తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ లో ఉంటే, ఆయనను కాదని, పవన్ కళ్యాణ్ వేరే పార్టీలో చేరతారా?పవన్ టిడిపిలోకి వస్తే అన్నయ్య ఏం చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి.