మిస్ వరల్డ్ 2012 గా చైనా ముద్దుగుమ్మ
posted on Aug 19, 2012 @ 10:50AM
అందాల పోటీల్లోనూ చైనా తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. స్వదేశంలో నిర్వహించిన మిస్ వరల్డ్-2012 పోటీల్లో చైనాకు చెందిన యు వెన్ సియా టైటిల్‌ను గెలుచుకుని డ్రాగన్ సత్తా చాటింది. భారతదేశం నుంచి గట్టి పోటీ ఇచ్చిన వన్యా మిశ్రా కేవలం టాప్ 7 వరకు వచ్చినా.. చివర్లో తడబడింది. చైనాకు మిస్ వరల్డ్ టైటిల్ దక్కడం ఇది రెండోసారి.
గత సంవత్సరపు విజేత వెనిజులాకు చెందిన ఇవియన్ సర్కోస్ చేతులమీదుగా మిస్‌వరల్డ్ కిరీటాన్ని వెన్ సియా అందుకుంది. బీజింగ్‌లోని డాంగ్‌షింగ్ ఫిట్‌నెస్ సెంటర్లో అంగరంగ వైభోగంగా ఈ టైటిల్ ప్రదాన కార్యక్రమం జరిగింది. 23 ఏళ్ల వెన్ ప్రస్తుతం సంగీతాన్ని అభ్యసిస్తోంది. భవిష్యత్తులో సంగీత ఉపాధ్యాయినిగానే స్థిరపడాలనుకుంటోంది. ఈ పోటీలో మొదటి రన్నరప్‌గా మిస్ వేల్స్ సోఫీ మౌల్డ్స్, రెండో రన్నరప్‌గా మిస్ ఆస్ట్రేలియా జెస్సికా కహావతి నిలిచారు.
మిస్ ఇండియా వన్యా మిశ్రా టాప్ 7కు మించి పైకి వెళ్లలేకపోయినా, ఆమెకు 'మిస్ సోషల్ మీడియా', 'బ్యూటీ విత్ ఎ పర్పస్' టైటిళ్లు దక్కడం కొంత ఊరట