సత్య నాదెళ్ళ తల్లి ప్రభావతి మృతి
posted on Mar 22, 2015 7:30AM
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ తల్లి ప్రభావతి (85) శనివారం స్వర్గస్తులయ్యారు. ఆమె గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ వార్త తెలియగానే ప్రస్తుతం విదేశాలలో ఉన్న సత్య నాదెళ్ళ వెంటనే హైదరాబాద్ బయలుదేరి వస్తున్నారు. ఆమె మృతిపట్ల ఆంద్ర, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేసారు. సత్య నాదెళ్ళ హైదరాబాద్ చేరుకొన్న తరువాత ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు