అద్వాని అస్త్ర సన్యాసం
posted on Jun 10, 2013 @ 5:51PM
బి. జె. పి. కురువృద్ధుడు ఎల్ . కె. అద్వాని ఆ పార్టీలోని తన అన్ని పదవులకు రాజీనామా చేశారు. బి. జె. పి తరఫున మోడీకి ప్రచార బాధ్యతలు అప్పగించిన తక్షణం ఆయన ఇలా రాజీనామా చేయటం దేశ ప్రజలందరిని ఒకింత విస్మయానికి గురి చేసింది. అద్వాని తన రాజీనామా లేఖలో నేడు వ్యక్తుల సొంత ఎజెండాతో నడుస్తున్న పార్టీయే గాని,నాడు శంకరముఖర్జీ,వాజిపేయి ల నాటి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీ కాదు అని పేర్కొనడం జరిగింది. అంటే ఇది పరోక్షంగా నరేంద్ర మోడీ ని గురించిన వ్యాఖ్యానమనే అనుకోవచ్చా?అయితే 86సం'ల అద్వాని కొత్త నీరు వస్తున్నపుడు పాత నీరు దానికి ఆహ్వా నమ్ పలకాలి అనే సంగతిని విస్మరించారా?
అద్వాని 1982లో 2ఎంపి సీట్లు మాత్రమే కలిగి ఉన్న బి. జె.పి ని తర్వాతి కాలంలోతన రధ యాత్ర ద్వారా భారతదేశాన్ని పరిపాలించే స్థాయికి బి. జె.పిని తీసుకెళ్ళిన ఘనుడు. ఆనాడు కేవలం అద్వాని సామర్థ్యం వల్లనే బి. జె. పి పట్టం గట్టినా,వాజిపేయి కి ప్రధాని పదవిని అప్పగించి,తన గౌరవాన్ని మరింతగా పెంచుకుకున్నారు. అదే నరేంద్రమోడి విషయానికొస్తే గుజరాత్ లో మూడు సార్లు అధికారంలోకి బి. జె. పి ని తీసుకొచ్చిన ఘనత కలిగిన నేత. గుజరాత్ ను అభివృద్ధి పధం వైపు తీసుకెళుతు ఒక్కసారి దేశ ప్రజలందరి దృష్టి తన వైపు మళ్లించుకున్న నాయకుడు నరేంద్రమోడి.
అయితే ఈనాడు కేవలం గుజరాత్ రాష్ట్ర స్థాయి అభివ్రుది,ఆస్థాయి పరిపాలన దేశాన్ని పరిపాలించే సామర్ధ్యానికి సరిపోవు అనేది అద్వాని అభిప్రాయమ్. అంతేకాదు గోద్రా అల్లర్ల నేపధ్యంలో నరేంద్రమోడి మీద ఉన్న మతతత్వ అభిప్రాయం,పార్టీకి మిగతా మతాల వారి ఓటు బాంక్ ను దూరం చేస్తుందనేది కూడా. అలాఐతే నాడు బాబ్రి మసీదు విషయంలో ఎల్. కె అద్వాని పట్ల కూడా దేశంలోని ఒక వర్గం ప్రజలకు ఇలాంటి అభిప్రాయమే ఉండవచ్చును కదా!పైగా 2002 నాటి గోద్రా అల్లర్ల విషయంలో నరేంద్ర మోడీ ని సమర్ధించింది,ఈ ఎల్కెఅద్వానీయె అన్న విషయం జగమెరిగిన సత్యం. అసలు బి. జె. పి అంటేనే మతతత్వ పార్టీ. అలాంటపుడు ఇపుడు కొత్తగా మోడీ వల్ల పార్టీకి జరిగే నష్టం ఏమిటి ?
ఇహ సామర్థ్యం విషయానికి వస్తే కార్గిల్ మరకలు,చిన్నరాష్ట్రాలు తద్వారా మావోఇష్టుల మరకలు బిజె.పి కి ఎటూ ఉండనే ఉన్నాయి,ఏది ఏమైనా నేడు బిజె.పి ని అనుకోని సమస్యలోకి నెట్టి,చేజేతులా నష్టాన్న్ని తెచ్చిపెట్టిన వాడుగా అద్వాని మిగిలిపోనున్నారా?