కింగ్‌ఫిషర్ ఎయిర్ హోస్టెస్ మృతి, 3 అరెస్ట్
posted on Oct 3, 2012 @ 2:43PM
కింగ్‌ఫిషర్ ఎయిర్ హోస్టెస్ మృతి కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పార్క్ మేనేజర్, ఆపరేటర్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ హోస్టెస్ మృతిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కింగ్‌ఫిషర్ ఎయిర్ హోస్టెస్ ఆఫిమాక్ (20) జెయింట్ వీల్ నుండి కిందపడి మృతి చెందింది. ఈమె గత కొంతకాలంగా ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తోంది. చెన్నై నగర శివార్లలోని ఈవిపి అమ్యూజ్‌మెంట్ పార్క్‌కు ఈమె మంగళవారం వెళ్లింది. పార్క్‌లోని భారీ జెయింట్ వీల్‌ను ఎక్కింది. అయితే ప్రమాదవశాత్తూ ఆమె జెయింట్ వీల్ పైనుండి కింద పడింది. ఆమెకు తలకు తీవ్రగాయాలయ్యాయి. అమ్యూజ్‌మెంట్ పార్క్ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలు నాగాలాండ్‌కు చెందిన వ్యక్తి.