ప్రముఖ కమెడియన్ జస్పాల్ భట్టీ మృతి
posted on Oct 25, 2012 @ 12:38PM
ప్రముఖ కమెడియన్ జస్పాల్ భట్టీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. జలంధర్ సమీపంలో గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న భట్టీ కారు రోడ్డు పక్కనున్న చెట్టుని బలంగా ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. శుక్రవారం విడుదల కావాల్సిన పంజాబీ సినిమా పవర్ కట్ ప్రమోషన్ కోసం భటిండా నుంచి జలంధర్ వెళ్తుండగా జస్పాల్.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కారు నడుపుతున్న జస్పాల్ కొడుకు జస్ రాజ్, హీరోయిన్ సురీల్ గౌతం.. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. మృతదేహాన్ని చండీఘర్ కి తరలించి అక్కడ అంత్యక్రియలు జరుపుతారు.