ఏ మందుకుంది సర్టిఫికేట్! ఆనందయ్యపై కుట్ర జరుగుతోందా?
posted on May 23, 2021 @ 2:56PM
ఎయిడ్స్ కు మందు లేదు నివారణ ఒక్కటే మార్గం. అలాగే కరోనాకు కూడా ఇంతవరకు మందు లేదు. ఇదీ మందు అని, ఈ మందు వాడితే కరోనా ఖాయంగా తగ్గుతుందని ఏ శాస్త్రవేత్త, ఏ వైద్యుడు, నిర్ధారించలేదు. చివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఒక నిర్ధారణకు రాలేదు. కరోనా సోకినా అనేక మంది లక్షలు లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకుని, చివరకు అయిన వారికి ఆఖరి చూపు భాగ్యం అయినా లేకుండా ఆసుపత్రి ఐసీయు నుంచి నేరుగా కాటికి చేరుతున్నారు. అదే కరోనాతో ఇంట్లోనే ఉండి వంటింటి వైద్యంతో బయటపడిన వారున్నారు.
నిజానికి కరోనా ఎక్కడ ఎలా పుట్టింది అనేదే ఇంతవరకు నిర్ధారణ కాలేదు. చైనా వ్యూహాన్ కేంద్రంగా ఎంతో కాలంగా చేస్తున్న జీవాయుధ పరోశోధనల ఫలితంగా కరోనా పుట్టిందా లేక సహజంగా ప్రకృతిలో చోటు చేసుకున్న పరిణామాల వలన ఈ మహమ్మారి పుట్టుకొచ్చిందా అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద కూడా సమాధానం లేదు. ఇటీవల వరం పదిరోజుల క్రితం కూడా అమెరిక , బ్రిటన్ కు చెందిన శాస్త్ర వేత్తలు, వైద్యులు మూడు కరోన పుట్టుకను తేల్చండని ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాశారు.
కొవిడ్ చికిత్సకు సంబంధించి ఏ ఒక్క మందులకు సంబంధించి ఎలాంటి పక్కా అవగాహన వైద్య ప్రపంచానికి లేదు. ఒక నిర్దిష్ట ప్రిస్క్రిప్షన్ అనేది లేకుండా చికిత్స జరిగిపోతోంది. వివిధ మందులు ప్రజల శరీరంపై ప్రయోగించి మానవ శరీరాలను ప్రయోగశాలగా మార్చేస్తున్నారు. ఇది అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణమవుతోంది. దివ్య ఔషధాలుగా పేర్కొన్న మందులు తెచ్చిపెట్టిన సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అనేక మంది చనిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు ‘రెమ్‌డెసివర్’ అనే మందు కొవిడ్ రోగికి పునర్జన్మనిచ్చే దివ్య ఔషధం, అని ప్రచారం జరిగింది. మార్కెట్లో మందు మాయమైంది. బ్లాకు మార్కెట్’లో వందల మందు వేలకు బెంగళూరు వంతో చోట్ల లక్షలకు అమ్ముడు పోయింది. మంత్రి కేటీఆర్, సోమూ సూద్ ట్విట్టర్ తెరిస్తే, ‘రెమ్‌డెసివర్’ రిక్వెస్ట్లు ... వారు తమ పలుకుబడిని ఉపయోగించి ఆ దివ్య ఔషదాన్ని ఇప్పించి పుణ్యం కట్టుకున్న సందర్బాలు అనేకం కనిపిస్తాయి. కానీ ఇప్పుడు అదే రెమ్‌డెసివర్’ వల్లనే చాలామంది చనిపోయారని అదే వైద్య రంగ నిపుణులు చెపుతున్నారు.
కొవిడ్ చికిత్సలో అదే పనిగా వాడిన స్టెరాయిడ్స్, ‘సైడ్ ఎఫెక్ట్స్’ గా మరో ప్రాణాంతక వైరస్ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ పుట్టు కొచ్చాయి. ఎక్కువకాలం ఐసీయులో ఉంచడం, ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ వినియోగం కూడా బ్లాక్ ఫంగస్’కు కారణమంటున్నారు. దీంతో ఎలాగో ప్రాణాలతో బయట పడ్డామని ఊపిరి తీసుకుంటున్న కొవిడ్ బాధితులు, బ్లాక్ ఫంగస్ భయంతో వణికి పోతున్నారు. ఇదనే కాదు కొవిడ్19వ్యాధికి వంటింటి చిట్కాల నుంచి వేలు లక్షలు, కోట్ల రూపాయల విలువచేసే అనేక చికిత్సలు జరుగు తున్నాయి. ఈ మందులు అన్నిటికీ, ఏ పరీక్షలు జరిపారో, ఎవరు అనుమతులు ఇచ్చారో, ఎవరికీ తెలియదు. ప్రపంచాన్ని పక్కన పెట్టి మన దేశం విషయాన్నే తీసుకున్నా రోజుకు నాలుగు వేల మంది కొవిడ్’తో కన్ను మూస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది పేరు మోసిన ఆసుపత్రులలో.. ఇంకా .ఎక్కువ పేరు మోసిన ఫార్మ కంపెనీలు తాయారు చేసిన మందులు వాడే, ప్రాణాలు వదిలారు. మరి ఇలా పోయిన, పోతున్న ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు?ఇంతవరకు అసలు అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాలేదు.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఓ సామాన్య ఆయుర్వేద వైద్యుడు బొణిగి ఆనందయ్య కరోనా చికిత్సకు ఒక దివ్యమైన ఔషదాన్నికనుగొని పైసా ఖర్చు లేకుండా వందల ప్రాణాలు కాపాడుతుంటే ఎక్కడలేని గద్దలు వాలి పోయాయి. ఆనందయ్య మందుకు,శాస్త్రీయతను ప్రశ్నిస్తున్నారు, సర్టిఫికేట్ ఏదని నిలదీస్తున్నారు. మొత్తానికి ఆనందయ్య మందుకు మూత బిగించే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. నిజానికి ఒక్క ఆనందయ్య మాత్రమే కాదు, తమకు అవకాశం ఇస్తే మొక్కల ద్వారా కరోనాను అరికట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఆయుర్వేద వైద్యులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఆ ప్రయత్నాలు అన్నింటినీ, డ్రగ్ మాఫియా , పొలిటికల్ మాఫియా మొగ్గలోనే తుంచేశాయి. అయితే ఆనందయ్య ఉదంతతో డ్రగ్ మాఫియా , పొలిటికల్ పవర్ మధ్య గల చీకటి బంధం వెలుగు చూసింది. ప్రపంచ మానవాళిని భయపెడుతూ అనేక మంది ప్రాణాలను బలిగొంటున్న కరోనా మహమ్మారికి సంబంధించి అనేక విషయాలు చర్చకు వస్తున్నాయి. ఇదొక శుభ పరిణామం.