Read more!

కరుణానిధి @ 91 నాటౌట్!

 

 

 

డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఏ ఫుడ్డు తింటున్నారోగాని చక్కగా 90 సంవత్సరాలు పూర్తిచేసుకుని 91 సంవత్సరంలో అడుగుపెట్టారు. నాస్తికవాదిగా ప్రస్థానం ప్రారంభించి, సినిమా రచయితగా తన ప్రతిభను నిరూపించుకుని, రాజకీయ నాయకుడిగా రాణించి, తమిళనాడు ముఖ్యమంత్రిగా సంచలనాలు సృష్టించి, ప్రస్తుతం ప్రతిపక్షంలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న కరుణానిధి తమిళనాడు రాజకీయాలలో ఒక లెజెండ్. అందులోనూ కరుణానిధి స్వతహాగా తెలుగువాడు కావడం మనకి గర్వకారణం. అధికారం నుంచి దూరమైనా, కుటుంబ సమస్యలు, కేసులు చుట్టుముట్టినా, మనిషి మాత్రం ఎంతమాత్రం క్రుంగిపోకుండా గట్టిగా వున్నాడు.


మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికలలో డీఎంకే పార్టీ మట్టిగొట్టుకుని పోయినా పెద్దమనిషి ఎంతమాత్రం తొణకలేదు. మంగళవారం ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని చెన్నైలో డీఎంకే కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కరుణానిధికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చక్రాల కుర్చీకి పరిమితమైనప్పటికీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కరుణానిధి ఉత్సాహంగా పుట్టినరోజువేడుకలు జరుపుకున్నారు. తన పుట్టినరోజు వేడుకలలో ఉత్సాహంగా వున్న కరుణానిధిని చూసి పెద్దాయన ఎలాంటి సమస్య లేకుండా సెంచరీ పూర్తి చేస్తాడన్న నమ్మకాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేశారు.