ఢిల్లీకి మూటలు మోయడానికి పోతే దొంగ లాగనే చూస్తారు...కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
posted on May 6, 2025 @ 2:45PM
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ముఖ్యమంత్రి రాష్ట్ర పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాన్నికి అణా పైసా అప్పు పుట్టడం లేదని.. అప్పుల కోసం బ్యాంకుల వద్దకు వెళితే దొంగలను చూసినట్లు చూస్తున్నారని సీఎం రేవంత్ మాట్లాడిన విషయం తెలిసిందే. ఇలా చెబితే ఎవరూ నమ్మడం లేదు.. కానీ పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉందని అన్నారు. స్వీయ నియంత్రణ మాత్రమే దీనికి సరైన పరిష్కారం అని అన్నారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ అందాల పోటీలకు 250 కోట్లు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి.. రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవా నిన్ను కోసుకొని తినడం కాదు నువ్వే రాష్ట్రాన్ని పీక్కొని తింటున్నావుని కేటీఆర్ అన్నారు. నేను ఎక్కడికి పోయినా నన్ను దొంగను చూసినట్లు చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అంటుండు దొంగను దొంగ అనకపోతే ఇంకేం అంటారని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నావా? సర్కస్ నడుపుతున్నావా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్లు అప్పు చేశారు అని అన్నాడు..
నిన్న రూ.8,29 లక్షల కోట్లు అని చెపుతున్నాడు.పూటకో లెక్క మాట్లాడుతూ, సంఖ్య పెంచుతున్నాడు.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అసలు అప్పు రూ.4 లక్షల 17 వేల కోట్లు మాత్రమే అని కేటీఆర్ క్లారీటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అసలు, వడ్డీ కలిపి నెలకు చెల్లించే అప్పు కేవలం రూ.2000 కోట్లు మాత్రమే ఇది కాగ్ లెక్క..మీ లాగా కాకి లెక్క కాదని మాజీ మంత్రి పేర్కొన్నారు. ఫోర్త్ సిటీలో 2000 ఎకరాలు ఎట్లా కొన్నావు రేవంత్ రెడ్డి ? నీ అన్నదమ్ములు, నీ బామ్మర్ది, నీ కుటుంబ సభ్యులు అందరి ఆదాయం పెంచుకున్నావు, కానీ రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగలేదని కేటీఆర్ తీవ్ర స్థాయి విమర్శలు చేశారు చివరిసారిగా చెప్తున్నా సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని వ్యక్తిగతంగా దూషిస్తే నీ నాలుక చీరేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.