ఢిల్లీ లో మాయమైన ముఖ్యమంత్రి
posted on Apr 18, 2013 @ 2:51PM
ఢిల్లీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెండు గంటల పాటు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా వదిలిపెట్టి ఎవరికి చెప్పా పెట్టకుండా మాయమైపోయాడు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరికీ సమచారం ఇవ్వకుండా రెండు గంటల పాటు ఎవరికీ తెలియని చోటుకు వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. గురువారం ఉదయం ఆయన సెక్యురిటీ ఎవ్వరూ తోడు లేకుండా, ఎవరికీ చెప్పా పెట్టకుండా ఆయన ఓ ప్రైవేట్ వాహనంలో బయటకు వెళ్లిపోయారు. ఎపి భవన్‌లో ఉన్న ఆయన సెక్యురిటీ సిబ్బందికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా బయటకు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి ఎక్కడు వెళ్లారు, ఎవర్ని కలిశారు అనేది తెలియడం లేదు. ఈ విషయం తీవ్ర ఉత్కంఠకు కారణమైంది.