Read more!

బాబు పాదయాత్ర ముగింపుకు ముహూర్తం

 

 

 

 

టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రకు ముగింపు ముహూర్తం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గాంధీ జయంతి నాడు మొదలు పెట్టిన పాదయాత్ర ను తన జన్మదినం రోజున ముగించాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 19 నాటి కి బాబు పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకోనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏప్రిల్ 19న విశాఖ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 20న విశాఖలో జన్మదిన వేడుకలు జరుపుకున్న అనంతరం చంద్రబాబు హైదరాబాద్‌కు రానున్నారు.

 


అయితే ఆయన మే 1 వరకు పాదయాత్ర చేసి టీడీపీ దివంగత నేత ఎర్రన్నాయుడు ఊరు నిమ్మాడ దాకా వెళతారని ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం పాదయాత్ర ముగించి హైదరాబాద్ వచ్చి సమీక్షలు చేస్తారని, ఆ తరువాత మిగిలిపోయిన ఆరుజిల్లాలలో పాదయాత్ర చేయాలా ? లేక బస్సు యాత్ర చేయాలా ? అనేది నిర్ణయిస్తారని తెలుస్తోంది.