ఢిల్లీ గ్యాంగ్ రేప్: ఆశారాం సంచలన వ్యాఖ్య, కేసు నమోదు

 

 

 

 

 

ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆధ్యాత్మిక గురువు ఆసారాం బాపూ పై కేసు నమోదైంది. న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా పిర్యాదు మేరకు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎన్ పి సింగ్ ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద ఆసారాం బాపూ పై కేసు నమోదు చేశారు.


గ్యాంగ్ రేప్ కు గురై చనిపోయిన యువతిని అసారాం తన వ్యాఖ్యలతో అవమానించారని, ప్రజల మనోభావాలు దెబ్బతీశారని న్యాయవాది సుధీర్ కుమార్ ఆరోపించారు. ఆయనను కటినంగా శిక్షించాలని కోరారు.

ఢిల్లీ గ్యాంగ్ రేప్ లో నిందుతులతో పాటు బాధితురాలిది కూడా సమాన బాధ్యత ఉందంటూ అసారాం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదం రేపింది. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన మహిళ లోకాన్ని, ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారని పిటిషనర్ ఆరోపించారు. 

Teluguone gnews banner