బాలయ్య శ్రీమన్నారాయణ నిర్మాత అరెస్ట్
posted on Sep 6, 2012 @ 11:42AM
కూకుట్‌పల్లిలోని అర్జున్ థియేటర్ వద్ద ఈ రోజు ఉదయం బాలకృష్ణ అభిమానులు ఆందోళనకు దిగారు. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తున్న ‘శ్రీమన్నారాయణ' ఎత్తివేసి, శిరిడిసాయి సినిమాను రిలీజ్‌చేశారని ఆ చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల ధర్నాకు దిగారు.
ఈ ధర్నాలో బాలయ్య అభిమానులు కుడా పాల్గొనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శ్రీమన్నారాయణ చిత్రాన్ని అర్జున్ థియేటర్ లో కొనసాగించాలని లేకపోతే థియేటర్ దగ్గర నుంచి కదలమని నిర్మాత అన్నారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని నిర్మాత, దర్శకుడిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లారు.