ఎన్టీఆర్, పవన్ తరువాత అల్లు అర్జున్!
posted on May 17, 2013 @ 4:09PM
పూరి జగన్నాథ్.. తెలుగు సినిమాకు స్పీడు నేర్పిన స్టార్ డైరెక్టర్.. చాలా రోజుల తరువాత బాలీవుడ్‌లో మెగాఫోన్ పట్టిన తెలుగు డైరెక్టర్.. కమర్షియల్ సినిమాకు కరెక్ట్ ఎగ్జామ్‌పుల్స్ లాంటి సినిమాలను చేసే ఈ స్టార్ డైరెక్టర్ కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేశాడు.
అవును పూరి లాంటి గ్రేట్ డైరెక్టర్ కూడా స్టార్ హీరోల విషయంలో మాత్రం పప్పులో కాలేశాడు.. భారీ బ్లాక్ బాస్టర్‌లతో మంచి ఫామ్‌లో ఉన్నారనుకున్న యంగ్ హీరోలను తన సినిమాతో మళ్లీ ఫ్లాప్ బాట పట్టించాడు..
పూరి కెరీర్ లోనే భారీ డిజాస్టర్స్‌లో ఆంద్రావాలా సినిమా ఒకటి.. సింహాద్రి లాంటి బిగ్ హిట్ తరువాత ఎన్టీఆర్ చేసిన ఈ సినిమాతో ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరోగా సెటిల్ అవుతాడు అనుకున్నారు.. అప్పటికే పూరికి కూడా మంచి ఇమేజ్ ఉండటంతో ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి.. కాని సినిమా రిలీజ్ తరువాత మాత్రం సీన్ రివర్స్ అయింది.. తొలి షో నుంచే సినిమా ఫ్లాప్ టాక్ మూట కట్టుకోవటంతో ఆ సినిమా ఎన్టీఆర్, పూరిల కెరీర్‌ను వెనక్కు నెట్టింది..
చాలా గ్యాప్ తరువాత ఇదే తప్పును మరోసారి చేశాడు పూరి… దాదాపు పుష్కరకాలంగా హిట్‌లేక సతమతమవుతున్న పవన్‌కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చిన సినిమా గబ్బర్‌సింగ్.. అప్పటి వరకు ఉన్న చలనచిత్ర రికార్డులన్నింటినీ తిరగరాస్తూ ఈసినిమా ఘనవిజయం సాదించింది.. అయితే ఈ సినిమా తరువాత పూరి తో కలిసి కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా చేశాడు పవన్.. మరోసారి కెరీర్ పీక్స్‌ను టచ్ చేసింది అనుకున్న హీరోకు తన సినిమాతొ చుక్కలు చూపించాడు పూరి..
ఇప్పుడు మరోసారి ఇదే సాహసం చేయబోతున్నాడు పూరి.. జులాయి లాంటి మంచి సక్సెస్‌తో ఫామ్‌లో ఉన్న అల్లు అర్జున్ హీరోగా ఇద్దరమ్మాయిలతో సినిమా చేస్తున్నాడు మరి ఈ సినిమాతో అయినా పూరి తన మీద ఉన్న ఈ అపవాదును చేరిపేసుకుంటాడో లేదో చూడాలి..