దినేష్ రెడ్డి నియామకం చెల్లదు: హైకోర్టు
posted on Aug 16, 2012 @ 12:15PM
డీజీపీగా దినేష్ రెడ్డి నియామకం చెల్లదని గతంలో క్యాట్ ఇచ్చిన నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. దినేష్ రెడ్డి నియామకాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. వారంలోగా డీజీపీ స్థాయి అధికారులు వివరాలను యూపీఎస్సీకి పంపాలని గురువారం హైకోర్టు ఆదేశించింది. యూపీఎస్సీ నివేదిక అందగానే వారంలోగా కొత్త డీజీపీని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. అంతే కాకుండా ప్రభుత్వానికి హైకోర్టు రూ.5వేలు జరిమానా విధించింది. డీజీపీ నియామకం చెల్లదంటూ కేంద్ర పరిపాలనా పరమైన వివాదాల పరిష్కార న్యాయస్థానం (క్యాట్) ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం, దినేష్‌డ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.