జగన్ పై ఇన్వెస్టర్ల ఒత్తిడి
posted on Oct 7, 2012 @ 4:55PM
జగన్ కు బెయిల్ రాకపోవడంతో ఆయన కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారు ఆందోళన చెందుతున్నారు. జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం కారణంగా తాము కుడా కేసుల్లో కూరుకుపోయామని, తమ పెట్టుబడులు వెనక్కి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారట. కొందరు పెట్టుబడిదారులు లోటస్‌పాండులోని జగన్ ఇంటికి వెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఈడి, సిబిఐ జగన్ ఆస్తులపై కొరడా ఝులిపించడంతో వారిలో ఆందోళన ప్రారంభమైందట. మరోవైపు జగన్ ఇంటికి వచ్చి వెళుతున్న వారిపై సిబిఐతో పాటు ఇంటెలిజన్స్ వర్గాలు నిఘా పెట్టాయట. ఎవరెవరు వస్తున్నారని గమనిస్తున్నారట. జగన్ జైలు నుండి బయటకు వస్తే పరిస్థితులు కొంచె కుదుట పడతాయని ఆయన కుటుంబ సబ్యులు, పార్టీ నేతలతో పాటు ఆయన కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారు కూడా భావించారు. అయితే ఇప్పట్లో జగన్‌కు బెయిల్ వచ్చే అవకాశాలు లేకపోవడంతో వారిలో ఆందోళన ప్రారంభమైందంటున్నారు.