విశ్వరూపంపై నిషేధం: కమల్ కు సినీ సెలబ్రిటీల మద్దతు
posted on Jan 24, 2013 @ 5:07PM
విశ్వరూపం' సినిమాపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించడంపై హీరో కమల్‌హాసన్ తీవ్ర అసహనం వ్యక్తపరిచారు. ప్రభుత్వ నిర్ణయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని కమల్ తెలిపారు. సాంస్కృతి తీవ్ర వాదాన్ని నిలిపివేయాలన్నారు. హిందూ-ముస్లీంల ఐక్యతకు, సహజీవనానికి కృషి చేస్తున్నాని, అలాంటి తనపై ఆరోపణలు తగవన్నారు. విశ్వరూపం సినిమాలో ముస్లీంలను ఉగ్రవాదులుగా చూపించారంటూ కొన్ని ఇస్లామిక్ సంస్థలు చేసిన విమర్శలను హీరో కమల్‌హాసన్ తిప్పికొట్టారు.
విశ్వరూపం తమిళనాడు ప్రభుత్వం నిషేధం పై పలువురు సినీ సెలబ్రిటీలు ప్రభుత్వ చర్యను ఖండింస్తున్నారు. కమల్ హాసన్ కు అంతా మద్దతుగా నిలుస్తున్నారు. ఈ మేరకు పేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషనల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా తమ మద్దతు ప్రకటిస్తున్నారు.
కుష్బు: విశ్వరూపం చిత్రంపై నిషేదం విధించారనే విషయం విని షాకయ్యాను. సెన్సార్ బోర్డు ఓకే చెప్పిన తర్వాత ప్రభుత్వం కలుగ జేసుకోవడం ఏమిటి. ఇది సరైంది కాదు. సరిగా ఉంటనే సెన్సార్ బోర్డు వారు సర్టిఫై చేస్తారు.
ప్రకాష్ రాజ్: తెలుగు, తమిళం, హిందీ సెన్సార్ బోర్డులు విశ్వరూపం చిత్రానికి క్లీయర్ సర్టిఫికెట్ ఇచ్చాయి. అలాంటప్పుడు బ్యాన్ విధించాల్సిన అవసరం లేదు. ముస్లిం కంట్రీ అయిన మలేషియా కూడా ఈ చిత్రానికి క్లీయర్ సర్టిఫికెట్ ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వం నిషేదం విధించడం సరైంది కాదు.
సిద్ధార్థ: విశ్వరూపం సినిమాపై బ్యాన్ విధించడం సరైంది కాదు. ఇలాంటి చర్యలు తమిళ సినీ పరిశ్రమకు తిరోగమనం లాంటిది.
మంచు లక్ష్మి: సినిమాలపై చెత్త రాజకీయాలు ప్రదర్శించ వద్దు. విశ్వరూపం చిత్రంపై నిషేదం విధించడం సరైంది కాదు.